Published : Aug 10, 2026, 07:44 AM ISTUpdated : Aug 10, 2026, 08:58 AM IST
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికి నాయక్ జంటగా నటించిన `కొరియన్ కనకరాజు` గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఇది మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కావడం విశేషం.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ఎట్టకేలకు హిట్ పడింది. ఆయన తాజాగా `కొరియన్ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత శుక్రవారం(ఆగస్ట్ 7)న ఈ చిత్రం విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్‌గా నటించగా, సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన చిత్రమిది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్‌ని తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. మూడు రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లని రాబట్టింది.
24
కొరియన్ కనకరాజు మూవీ 3 రోజుల కలెక్షన్లు
వరుణ్ తేజ్‌కి హిట్ లేక చాలా రోజులవుతుంది. దీంతో ఆ లోటుని ఇప్పుడు `కొరియన్ కనకరాజు` తీర్చింది. ఎట్టకేలకు వరుణ్ తేజ్‌కి హిట్ పడింది. ఈ సినిమా మూడు రోజుల్లో మంచి వసూళ్లని రాబట్టింది. మొత్తంగా ఇది రూ.35కోట్లు రాబట్టినట్టు సమాచారం. రెండు రోజుల్లోనే దీనికి రూ.23.6కోట్లు రాగా, మూడో రోజు దాదాపు రూ.13కోట్లు వసూలు చేయడం విశేషం. గత రెండు రోజులతో పోల్చితే ఆదివారం దీనికి కలెక్షన్లు పెరిగాయి. సండే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్ ఆడిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మూడు రోజుల్లో సుమారు ఇరవై కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ సైట్లు వెల్లడించడం గమనార్హం.
34
మూడు రోజుల్లోనే కొరియన్ కనకరాజు బ్రేక్ ఈవెన్
ఇక `కొరియన్ కనకరాజు` చిత్రానికి సుమారు రూ.38కోట్ల బడ్జెట్ అయ్యిందని సమాచారం. సినిమాకి అయిన థియేట్రికల్ బిజినెస్ రూ.12కోట్లు. నాన్ థియేట్రికల్‌గా సుమారు రూ.26కోట్లు వచ్చాయి. దీనికి థియేటర్ రన్ ద్వారా రూ.35కోట్లు రావడంతో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కావడమనే కాదు ఆల్‌రెడీ లాభాల్లోకి వెళ్లింది. ఇటీవల కాలంలో ఇలా తొలి వారాంతంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ కావడం అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. అంతేకాదు సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాలిడ్‌గానే ఉంది. ఇది సినిమా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుందనే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. మొత్తంగా `కొరియన్ కనకరాజు` మూవీ వరుణ్ తేజ్‌కి కెరీర్ బెస్ట్ కలెక్షన్లని రాబడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
`కొరియన్ కనకరాజు` హర్రర్, థ్రిల్లర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. వరుణ్ తేజ్ కనకరాజుగా కనిపించారు. ఆయన లోకల్‌గా గల్లీ రౌడీ లాంటి వాడు. బార్‌లో ప్రత్యర్థులతో గొడవలో భాగంగా ఆయన ఒక కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ఉన్న బాటిల్‌లో మందు పోసుకొని తాగుతాడు. దీంతో ఆ ఆత్మ కనకరాజులోకి వెళ్తుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న కామెడీ అంశాలు, యాక్షన్ అంశాల సమాహారమే ఈ చిత్రం. థ్రిల్‌కి గురి చేస్తూ నవ్విస్తూ, యాక్షన్‌తో ఆకట్టుకుందీ మూవీ. సత్య కామెడీ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు.