సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న 'స్పిరిట్' సినిమాలో విలన్‌గా ఓ దక్షిణ కొరియా స్టార్ నటించబోతున్నాడట. ఈ విషయంలో నిజం ఎంత, ఎవరా స్టార్ నటుడు?
ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమాగా స్పిరిట్ తెరకెక్కబోతోంది. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. పోలీస్ డ్రామా స్టోరీతో తెరకెక్కనున్న స్పిరిట్, షూటింగ్ స్టార్ట్ కాకముందే భారీగా అంచనాలను క్రియేట్ చేస్తోంది. అయితే ఈసినిమాకు సబంధిచి రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
24
స్పిరిట్ సినిమాపై రకరకాల రూమర్స్
స్పిరిట్ సినిమాకు సబంధించి రోజుకో న్యూస్వైరల్ అవుతోంది. ఈసినిమాలో నటించే యాక్టర్స్ విషయంలో కూడా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఈక్రమంలో స్పిరిట్ లో కొరియన్ స్టార్ యాక్టర్ నటించబోతున్నట్టు సమాచారం. అతను ఎవరో కాదు డాన్ లీ. ఓటీటీ, సోషల్ మీడియా వల్ల కొరియన్ నటుడు డాన్ లీకి ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నటుడు ప్రభాస్ 'స్పిరిట్' సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నట్టు తెలుస్తోంది.
34
స్పిరిట్ లో కొరియన్ స్టార్
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తీస్తున్న 'స్పిరిట్'తో డాన్ లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు 'ముకో' అనే కొరియన్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ ఎక్స్ (X)లో పోస్ట్ చేసింది. డాన్ లీసినిమాలు ఇండయాలో కూడా చాలా ఫేమస్. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కోసం భారీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కొరియన్ స్టార్స్ ను తీసుకుంటున్నాడంటే..యాక్షన్ సీక్వెన్స్ లు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయని ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
ప్రభాస్ పాత్రకు విలన్‌గా డాన్ లీ నటిస్తున్నారని ముకో పోస్ట్‌లో కనిపిస్తోంది. అయితే స్పిరిట్ ను ా కొరియాలో కూడా రిలీజ్ చేస్తారా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. అంతే కాదు కొరియన్ స్టార్ ప్రభాస్ మూవీలో నటించబోతున్నట్టు..స్పిరిట్ టీమ్ నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాేలేదు. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే.