Naga Chaitanya: పాన్ ఇండియా డైరెక్టర్ తో నాగ చైతన్య మూవీ ? క్యూలో మరికొందరు స్టార్ డైరెక్టర్లు

Published : Feb 21, 2026, 09:59 PM IST

నాగ చైతన్య తదుపరి చిత్రంపై రూమర్స్ పెరుగుతున్నాయి. ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ తో చైతు సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. తండేల్ విజయం తర్వాత నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది నాగ చైతన్య 24వ మూవీ. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకుడు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే నాగ చైతన్య మైల్ స్టోన్ మూవీ గురించి చర్చ మొదలైపోయింది. నాగ చైతన్య 25వ చిత్రం గురించి అప్పుడే అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

25
నాగ చైతన్య 25వ చిత్రం

నాగ చైతన్య టీమ్ నుంచి కూడా కొన్ని లీకులు వస్తున్నాయి. ఈ క్రమంలో నాగ చైతన్య 25వ చిత్రం పై హైప్ పెరుగుతోంది. నాగ చైతన్య 25వ చిత్రం కోసం కొందరు స్టార్ డైరెక్టర్లు క్యూలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వారిలో పాన్ ఇండియా డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

35
సోషల్ మీడియాలో రూమర్స్

సోషల్ మీడియాలో నాగ చైతన్య అభిమానులు కొందరు దర్శకుల పేర్లు వైరల్ చేస్తున్నారు. కొరటాల శివతో పాటు శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి కూడా చైతు 25వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు.

45
దేవర 2 ఎప్పుడు ?

కొరటాల శివ దేవర చిత్రంతో పాన్ ఇండియా గుర్తింపు సాధించారు. ఈ చిత్రానికి సీక్వెల్ గా దేవర 2 ఉంది. కానీ అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. దీనితో కొరటాల నెక్స్ట్ మూవీ ఏంటనేది కూడా ప్రశ్నర్థకంగా మారింది. ఈ క్రమంలో కొరటాల శివ తదుపరి సినిమాపై రూమర్స్ మొదలయ్యాయి.

55
శేఖర్ కమ్ముల కూడా ఖాళీగానే

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల కూడా ఖాళీగా ఉన్నారు. వెంకీ అట్లూరి మాత్రం హీరో సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు. నాగ చైతన్యతో వీరిలో ఎవరు సినిమా చేయబోతున్నారు ? అసలు నిజంగానే చైతూతో చర్చలు జరుగుతున్నాయా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Read more Photos on
click me!

Recommended Stories