ANR: ఏఎన్నార్ టైటిల్ వాడుకుని అట్టర్ ఫ్లాప్ అయిన నాగార్జున, కృష్ణ, మహేష్ బాబు..ఆ కమెడియన్ ఒక్కడే

Published : Feb 21, 2026, 08:14 PM IST

అక్కినేని నాగేశ్వర రావు ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాల టైటిల్స్ ని చాలా మంది హీరోలు వాడుకున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
అక్కినేని నాగేశ్వర రావు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వర రావు ఒక లెజెండ్. ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతో దూసుకుపోతున్న టైంలో ఏఎన్నార్ కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. టాలీవుడ్ లో సినిమా టైటిల్స్ రిపీట్ కావడం చూస్తూనే ఉన్నాం.

25
సినిమా టైటిల్స్ రిపీట్

ఏఎన్నార్ నటించిన సినిమాల టైటిల్స్ ని ఆ తర్వాతి కాలంలో చాలా మంది హీరోలు వాడుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఏఎన్నార్ సినిమా టైటిల్స్ ని తన సినిమాలకు రిపీట్ చేశారు. ఏఎన్నార్ సినిమా టైటిల్స్ ని రిపీట్ చేసినప్పుడు ఆ హీరోలకు ఫ్లాపులు తప్పలేదు.

35
నాగార్జున సినిమా ఫ్లాప్

ఈ జాబితాలో ఏఎన్నార్ తనయుడు నాగార్జున కూడా ఉన్నారు. నాగార్జున ఏఎన్నార్ దేవదాసు టైటిల్ వాడుకున్నారు. దేవదాస్ అనే టైటిల్ తో నాగార్జున, నాని నటించిన మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.

45
కృష్ణ, మహేష్ బాబు ఇద్దరూ

సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లోనే ఈ టైటిల్ ని వాడుకున్నారు. కృష్ణ నటించిన దేవదాసు చిత్రం డిజాస్టర్ అయింది. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఏఎన్నార్ టైటిల్ వాడుకున్నారు. యువరాజు అనేది ఏఎన్నార్ నటించిన చిత్రం. అదే టైటిల్ తో మహేష్ బాబు సినిమా కూడా వచ్చింది.

55
కమెడియన్ ఒక్కడే

కానీ మహేష్ బాబు యువరాజు మూవీ ఫ్లాప్ అయింది. ఏఎన్నార్ సినిమా టైటిల్స్ రిపీట్ చేసి సక్సెస్ అయిన కొద్దిమంది హీరోల్లో ఓ కమెడియన్ ఉన్నారు. ఆ కమెడియన్ ఎవరో కాదు.. సునీల్. 1973లో ఏఎన్నార్ నటించిన అందాల రాముడు చిత్రం సూపర్ హిట్ అయింది. అదే టైటిల్ ని సునీల్ రిపీట్ చేశారు. సునీల్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన అందాల రాముడు చిత్రం కూడా సూపర్ హిట్ అయింది.

Read more Photos on
click me!

Recommended Stories