ఓజి మూవీ నుంచి ప్రియాంక మోహన్ బ్యూటిఫుల్ ఫస్ట్ లుక్.. పోస్టర్స్ వైరల్

Published : Aug 16, 2025, 06:31 PM IST

పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజి. సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. 

PREV
15
ఓజి మూవీ రిలీజ్ డేట్ 

పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా “ఓజి ”.  ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా సినీ ప్రేక్షకులు, పవన్ అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం ఇదే. ఈ భారీ చిత్రాన్ని సెప్టెంబర్ 25, 2025న గ్రాండ్‌గా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

25
ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్

కొన్ని రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ “ఫైర్‌స్టార్మ్” సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఇప్పటివరకు హీరోయిన్ ప్రియాంక మోహన్ లుక్‌ను రివీల్ చేయలేదు. అభిమానుల ఆత్రుత మధ్య, చిత్ర బృందం ఈ రోజు ప్రత్యేక సర్‌ప్రైజ్‌గా ప్రియాంక మోహన్ రెండు కొత్త పోస్టర్లను విడుదల చేసింది.

35
కణ్మని పాత్రలో ప్రియాంక మోహన్  

చీర కట్టుకుని హోమ్లీగా అందంగా కనిపించిన ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ కలిసి నటించడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో ఆమె కణ్మని పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఆమె కథానాయకుడి జీవితంలో ప్రశాంతతను తీసుకువచ్చే కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

45
సెకండ్ సింగిల్ అప్డేట్ 

ఇప్పటికే ప్రకటించినట్లుగా, రెండో సింగిల్ లవ్ మెలోడీ రూపంలో రానుంది. ఇందులో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా కనిపించనున్నారు. దీని ప్రోమోను త్వరలో విడుదల చేయనున్నారు.

55
ఓజిలో నటీనటులు 

ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శామ్, శ్రీయా రెడ్డి, వెంకట్, హరీష్ ఉత్తమన్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎస్.ఎస్. థమన్ అందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories