ముదురుతున్న ఆచార్య వివాదం.. కోర్టుకు వెళ్తానంటున్న కొరటాల శివ

First Published | Aug 27, 2020, 5:40 PM IST

ఆచార్య సినిమా కథ కాపీ వివాదంపై కొరటాల శివ ఓ టీవీ చానల్ డిస్కషన్‌ లో పాల్గొన్నారు. ఈ చర్చలో భాగంగా రాజేష్ చెబుతున్నట్టుగా ఈ కథ తనది కాదని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే కోర్టులో కేసు వేస్తానంటూ చెప్పారు శివ.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఇటీవల మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వివాదాలు చుట్టు ముడుతున్నాయి. రాజేష్ అనే వ్యక్తి ఆచార్య సినిమా కథ నాదే అంటూ ఆరోపణలు చేస్తున్నాడు.
అయితే ఈ వివాదం ముదురుతుండటంతో గురువారం చిత్రయూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాజేష్ ఆరోపణలు చేస్తున్నట్టుగా ఈ సినిమా కథ కాపీ కాదని, ఈ కథను పూర్తి కొరటాల స్వయంగా తయారు చేశారని ప్రెస్‌ నోట్ రిలీజ్ చేశారు. అయితే ఈ విషయంపై కొరటాల శివ ఓ టీవీ చానల్ డిస్కషన్‌ లో పాల్గొన్నారు.

ఈ చర్చలో భాగంగా రాజేష్ చెబుతున్నట్టుగా ఈ కథ తనది కాదని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే కోర్టులో కేసు వేస్తానంటూ చెప్పారు శివ. అయితే రాజేష్ మాత్రం ఆచార్య కథ కాపీ అనేందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్నాడు.
కొరటాల దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తే తనకు కథ చెప్పాడని, ఆ నమ్మకంతోనే తాను ఈ ఆరోపణలు చేస్తున్నట్టుగా చెప్పాడు రాజేష్‌. తనకు ఎక్కడా న్యాయం జరగటం లేదు కాబట్టే చిరంజీవి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చానని చెప్పాడు.
రాజేశ్‌ తాను కథను మైత్రీ మూవీ మేకర్స్‌ వారికి కథ వినిపించినట్టుగా చేసిన ఆరోపణలు ఆ నిర్మాణ సంస్థ కూడా ఖండించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. రాజేష్ కథ చెప్పిన మాట వాస్తవమే కానీ అతని కథ బాగా లేకపోవటంతో రిజెక్ట్ చేశామని చెప్పారు. కొరటాల శివ మీద రాజేష్ చేస్తున్న ఆరోపణలను మైత్రీ సంస్థ ఖండించింది. అంతేకాదు రాజేష్ మీద చర్యలు తీసుకుంటాం అంటూ ప్రెస్‌నోట్‌లో వెల్లడించారు.

Latest Videos

click me!