ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర (Devara).స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది.
ఈ క్రమంలో ఈ సినిమా నుంచి రాబోయే ప్రతి అప్డేట్ పై ఫ్యాన్స్ తమ ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా దేవర సినిమాపై క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.అది దర్శకుడు కొరటాల శివ రెమ్యునరేషన్ .
దేవర సినిమా సక్సెస్ దర్శకుడు కొరటాల శివకు ఎంత అవసరమో ..అంతకు మించి ఎన్టీఆర్ కు ఉంది. అందుకు కారణం సోలోగా ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రవేశిస్తూండటమే. ఎన్టీఆర్ దాదాపు ఆరేళ్ల తర్వాత చేస్తున్న సోలో చిత్రం ఇది. అంటే దేవర భారం మొత్తం ఎన్టీఆర్ తో పాటు కొరటాల శివ భుజాలపైనే కూడా ఉంది.
దానికి తోడు RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. ఫ్యాన్స్ తో సమానంగా యాంటీ ప్యాన్స్ కూడా ఈ మూవీ కోసం వేయి కండ్లతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు జనాల్లోకి బాగా వెళ్లాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం డివైడ్ టాక్ తెచ్చుకోవడం ఇప్పుడు బాగా చర్చనీయాంశం అయ్యింది.
సాధారణంగా ఏదైనా పెద్ద చిత్రం ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు పీక్స్ కు వెళ్లిపోతాయి. దేవర పార్ట్ 1(Devara Part 1) ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయని టీమ్షఫ్యాన్స్ వెయిట్ చేశారు. కానీ బాగుంది ట్రైలర్ అంటున్నారు కానీ అరాచకం అద్బుతం అనటం లేదు. సినిమాకు మొదటి నుంచి ఇస్తున్న హైప్ ని ట్రైలర్‌లో ఏమాత్రం రీచ్ కాలేదని, అలాగే ట్రైలర్ ను కట్ చేసిన విధానం పాన్ ఇండియా సినిమా స్దాయిలో లేదని అంటున్నారు.
ఈ విషయం ప్రక్కన పెడితే కొరటాల శివ ఈ సినిమా నిమిత్తం భారీ ఎమౌంట్ ని ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దేవర చిత్రం కోసం కొరటాల శివ 30 కోట్లు ఛార్జ్ చేసారు. చిరంజీవితో చేసిన ఆచార్య ఫెయిల్ అయినా ఈ సినిమాతో హై సక్సెస్ సాధిస్తారనే నమ్మకంతో ఉన్నారు. దానికి తోడు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోని డైరక్ట్ చేస్తూండటంతో ఈ మొత్తం తీసుకున్నట్లు చెప్తున్నారు.
ఎన్టీఆర్ ఖఛ్చితంగా ఈ సినిమాతో ప్యాన్ ఇండియా మార్కెట్ లో తనదైన శైలిని పరిచయం చేస్తారు. యాక్షన్ చిత్రాలకు నార్త్ బెల్ట్ లో ఉన్న ఆదరణ దృష్ట్యా అక్కడ కూడా బాగానే బిజినెస్ జరుగుతోంది. అలాగే ఎన్టీఆర్ హిందీ డబ్బింగ్ సినిమాలు అక్కడ టీవీల్లో యూట్యూబ్ లలో చూసే జనం ఎక్కువ.
దాంతో ఆయనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. ఇవన్నీ ప్రక్కన పెడితే కరణ్ జోహార్ వంటి స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అక్కడ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయటంతో సరైన థియేటర్స్ దొరుకుతాయి. అలాగే జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్ అక్కడ వారికి ఖచ్చితంగా ఆసక్తి కలిగించే అంశాలే.
‘దేవర’ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్’లో రామ్ చరణ్‌తో కలిసి నటించా. ఆరేళ్ల తర్వాత నా సోలో మూవీగా ‘దేవర’ రిలీజ్ కానుంది. కాస్త టెన్షన్‌గా ఉంది. విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ముంబయిలో ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో సమయంలో నార్త్ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయా. ఈ కొత్త సినిమానీ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
‘‘దేవర’ విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. చివరి 40 నిమిషాలు సినిమా మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమా సినిమాకీ కొరటాల శివపై నా ప్రేమ, గౌరవం పెరుగుతూనే ఉంటాయి. ఆయనతో ఎంతోకాలంగా పరిచయం ఉంది. నా ‘బృందావనం’ సినిమాకి శివ రచయిత. కమర్షియల్ చిత్రాల్లో.. ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తుంటాడు హీరో. ‘దేవర’లో దానికి భిన్నంగా ఉంటుంది. ఇందులో మనిషిని చంపేంత ధైర్యంతో ఉండే కొందరికి హీరో భయాన్ని పరిచయం చేస్తాడు. అండర్ వాటర్‌లో 38 రోజులు చిత్రీకరణ చేశాం. హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఈ సినిమా రాబోతుంది’’ అని చెప్పుకొచ్చారు.