ముంబైలో ఇల్లు, లగ్జరీ కార్లు.. సూర్య- జ్యోతిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. భర్త కంటే భార్యనే.!

Published : Mar 12, 2024, 10:56 PM IST

కోలీవుడ్ స్టార్స్, ఫేవరెట్ కపుల్స్ సూర్య (Suriya) - జ్యోతిక ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. అయితే వీరిద్దరి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు నెట్టింట వైరల్ గా మారింది. అయితే భర్త కంటే భార్యకే ఎక్కువ ఆస్తులు ఉండటం ఆసక్తికరమైన విషయం.

PREV
16
ముంబైలో ఇల్లు, లగ్జరీ కార్లు.. సూర్య- జ్యోతిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. భర్త కంటే భార్యనే.!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ప్రయోగాల హీరో తెలుగు ఆడియెన్స్ కూ బాగా పరిచయమే. ఎంతో ఇష్టం కూడానూ.

26
Suriya

సూర్య, నటి జ్యోతిక (Jyothika)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం తమ విద్యాభ్యాసనను పూర్తి చేసుకుంటున్నారు. వారి ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. 

36

ఇక పిల్లల చదువుల కోసం సూర్య, జ్యోతిక చెన్నై నుంచి కొద్ది నెలల కింద ముంబైకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. అదే సమయంలో తండ్రితో గొడవ అయ్యిందనే తప్పుడు వార్తలు ప్రచారం లోకి వచ్చాయి. ఆ తర్వాత క్లారిటీ వచ్చింది.

46

ఇదిలా ఉంటే.. తాజాగా సూర్య - జ్యోతికల ఆస్తుల వివరాలు ఆసక్తికరంగా మారాయి. కొన్ని నివేదికల ప్రకారం.. వీరిద్దరి పేరు మీద రూ.537 కోట్ల విలువగల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. 

56

ముంబైలో రూ.70 కోట్ల విలువైన ఇల్లు, చెన్నైలోనూ ఓ ఖరీదై ఇల్లును కలిగి ఉన్నారు. అలాగే రూ.1.38 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్, రూ.80 లక్షల ఆడీ క్యూ7, రూ.61 లక్షల విలువైన మెర్సీడెజ్ బెంజ్, రూ.1.10 కోట్ల విలువగల జాగ్వార్ కార్లు ఉన్నాయి. 

66

ఇలా ఆస్తుల మొత్తం కలిపి రూ.537 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో సూర్య పేరు మీద రూ.206 కోట్ల ఆస్తులుంటే... భార్య జ్యోతిక పేరున రూ.331 కోట్ల ఆస్తులు ఉన్నాయంట. భర్త కంటే భార్యనే ఎక్కువ ఆస్తులు కూడగట్టడం ఆసక్తిగా మారింది. ఇక సూర్య నెక్ట్స్ ‘కంగువా’ Kanguva చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

click me!

Recommended Stories