Vijay Deverakonda : ఫ్యామిలీ స్టార్ నుంచి సాంగ్.. విజయ్ దేవరకొండ డ్యాన్స్.. ఇప్పుడు నెట్టింట ఇదే చర్చ!

Published : Mar 12, 2024, 10:17 PM IST

మరోసారి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  నెట్టింట సెన్సేషన్ గా మారారు. ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి వచ్చిన అప్డేట్ తో రౌడీ హీరో ఇంటర్నెట్ లో రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. 

PREV
16
Vijay Deverakonda : ఫ్యామిలీ స్టార్ నుంచి సాంగ్.. విజయ్ దేవరకొండ డ్యాన్స్.. ఇప్పుడు నెట్టింట ఇదే చర్చ!

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగానటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) . పరుశురామ్ పెట్ల చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 

26

సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. మొత్తానికి రేపు వచ్చే నెలలో గ్రాండ్ గా విడుద కాబోతోంది. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో హైప్ పెంచేలా టీమ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తోంది. 
 

36

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ అభిమానులు, ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రౌడీ హీరో కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. 

46

విజయ్ సినిమాను ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తారో మనికి తెలిసిందే.. ఇక సినిమా కోసం అంతకు మించి కష్టపడుతారని కూడా ఇటీవల ఫ్రూవ్ చేస్తున్నారు. ‘లైగర్’ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ బాడీ లాంగ్వేజ్, కొత్త పాత్రకు న్యాయం చేయడంలో విఫలం కాలేదు. 

56

ఇక ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ Family Star Movie నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. గతంలో మొదటి పాట విడుదల కాగా.. తాజాగా రెండో పాట ‘కళ్యాణి వచ్చా వచ్చా‘ (Kalyani Vaccha Vacchaa) అనే సాంగ్ విడుదలైంది.

66

ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ డ్యాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఈ సినిమాలో విజయ్ ట్రెడిషనల్ గా కనిపించడంతో పాటు ఆకట్టుకునే స్టెప్పులేయడం అందరీ దృష్టిని ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గోపీసుందర్ క్యాచీ ట్యూన్ అందించారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories