జనవరి నెలలో పెద్దగా కలెక్షన్స్ లేకపోయినా ఫిబ్రవరిలో అయినా అజిత్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది అనుకున్నారు అంతా. కాని భారీ అంచనాల నడుమ, ఎంతో హడావిడిగా రిలీజ్ అయిన అజిత్ పట్టుదల సినిమా ఫెయిల్ అయింది.
అజిత్ కెరీర్‌లో పెద్ద ఫ్లాప్ సినిమాగా విడాముయర్చి( పట్టుదల) నిలిచింది. దీనికోసమా ఇంత బిల్డప్ ఇచ్చారు అని అభిమానులే విమర్శించేలా విడాముయర్చి ఉంది. ఆ తర్వాత ప్రేమికుల రోజున సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.
ఆ తర్వాత కోలీవుడ్‌కి ఊపిరి పోసినట్టుగా 21వ తేదీన ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమా రిలీజ్ అయింది. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానిపనిని..ఆ కుర్ర హీరో సాధించాడు. డ్రాగన్ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేసి కోలీవుడ్ కు కాస్త ఊరటనిచ్చింది. ఈ సంవత్సరంలో ఎక్కువ కలెక్షన్స్ చేసిన సినిమా కూడా ఇదే.
ఇక డ్రాగన్ తో పాటు ధనుష్ దర్శకత్వంలో.. అతని మేనల్లుడు హీరోగా ఓ సినిమాను రిలీజ్ చేశారు. కాని ఈసినిమా డిజాస్టర్ అయ్యింది. డ్రాగన్ సినిమాతో ఈసినిమాకు పోలిక పెడుతూ.. అనేక విమర్శలు కూడా వచ్చాయి. ధనుష్ యాంటీ ఫ్యాన్స్ అయితే డ్రగన్ ను అడ్డుపెట్టుకుని దుమ్మెత్తిపోశారు. ఫిబ్రవరిలో మొత్తం 19 సినిమాలు రిలీజ్ అవ్వగా.. అందులో ఒక్క సినిమానే హిట్ అయింది.
Also Read: రాధిక అల్లుడు ఒక స్టార్ క్రికెటర్ అని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా స్టార్ ప్లేయర్ ?