Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సరిగ్గా సినిమాలు చేస్తే.. ఏడాదికి ఎన్ని వందల కోట్లు సంపాదిస్తారో తెలుసా?

First Published | Feb 18, 2024, 7:47 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక్క సినిమాకు ఒక్కరోజుకే కోట్లు తీసుకుంటారు. అలాంటిది ఆయన పూర్తి స్థాయిలో సినిమాలు చేస్తే ఏడాదికి ఎన్ని వందల కోట్లు సంపాదిస్తారో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే...  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇటు సినిమాలు, అటు పొలిటికల్ ప్రోగ్రామ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజకీయ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఆయన...  సినిమాలపై కాస్తా తక్కువగానే ఫోకస్ పెట్టారు.

అయినా.. ఓవైపు సమయం కేటాయించి మరీ సినిమాలు చేస్తున్నారు. మరోవైపు క్రమం తప్పకుండా జనాల్లో ఉంటూ పొలిటికల్ ప్రొగ్రామ్స్ కు హాజరవుతున్నారు. జనాల్లో ఉంటూనే సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.


కాగా, పవన్ కళ్యాణ్ తను నటించే చిత్రాలకు యావరేజ్ గా ఒక్కరోజుకే రూ.2 కోట్ల వరకు తీసుకుంటానని ఓ సభలో చెప్పిన విషయం తెలిసిందే... ఇదిలా ఉంటే... ఆయన ఏడాది పాటు సినిమాలపైనే ఫోకస్ చేస్తే ఎన్ని వందల కోట్లు సంపాదిస్తారో కూడా చెప్పుకొచ్చారు. 

ఏడాది సమయం కూడా అవసరం లేకుండా.. ఒకవేళ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తే మాత్రం రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు సంపాదిస్తానని గతంలో తానే స్వయంగా చెప్పారు. అది కూడా 200 రోజులు పనిచేసి మాత్రమేనని చెప్పారు. 
 

నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి కాస్తా ఫోకస్ షిఫ్ట్ చేశారు గానీ... ఆయన రేంజ్ కు ఇంకా ఎక్కువే సంపాదిస్తారని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు మాత్రం రూ.40 నుంచి రూ.60 కోట్లు తీసుకుంటున్నారు. 

పవర్ స్టార్ నుంచి నెక్ట్స్ ‘ఓజీ’ (They Call Him OG) సినిమా రాబోతోంది. 2024 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ వంటి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. 

Latest Videos

click me!