Manasi Ghosh, a talented singer from Kolkata, won the prestigious title of Indian Idol Season 15.
ఇండియన్ ఐడిల్ గెలుచుకున్న 24 ఏళ్ల మానసి ఘోష్ కి నిర్వాహకులు రూ. 25 లక్షలు క్యాష్‌ప్రైజ్, ఒక కారు, ట్రోఫీని అందజేశారు. ఫైనల్ రౌండ్‌లో ఆమె శుభజిత్ చక్రవర్తి, స్నేహ శంకర్‌లను ఓడించి ప్రతిష్టాత్మక ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విషయన్ని సోనీ టీవీ వారు ట్విట్టర్ ఖాతాలో సింగర్ మానసి చిత్రంతోపాటు ఇతర వివరాలను షేర్ చేశారు.
Manasi Ghosh, a talented singer from Kolkata, won the prestigious title of Indian Idol Season 15.
ఫైనల్స్‌కి సింగర్ మానసి కుటుంబ సభ్యులు వచ్చారు. ట్రోఫీ గెలిచిన తర్వాత మానసి మాట్లాడుతూ.. ఇండియన్ ఐడిల్ స్టేజిపైన పాట పాడటం అందులోనూ ఫైనల్స్‌కి చేరడం మరిచిపోలేని అనుభూతి అని తెలిపింది. ఫైనల్స్‌లో తాను పాడుతూ... తన తల్లి, కుటుంబ సభ్యుల ఫ్లేస్‌లు గమనించానని వారందరూ ఎంతో ఎమెషన్స్‌తో ఒకసారి ఏడుస్తూ,,, ఒకసారి నవ్వూతూ ఆనందబాష్పాలు తెచ్చుకున్నారని మానసి చెబుతోంది.
Manasi Ghosh, a talented singer from Kolkata, won the prestigious title of Indian Idol Season 15.
ఇక మానసి సింగింగ్‌లో రాణించడానికి మొదటి నుంచి కూడా ఆమె తల్లి సపోర్టుగా నిలిచిందని, ఆమె వల్లే ఇలాంటి జాతీయ వేదికపై పాడే అవకాశం వచ్చిందని ఎమెషనల్ అయ్యింది మానసి. కుటుంబ సభ్యులతోపాటు దేశ వ్యాప్తంగా తనకు సపోర్టు చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పింది. మానసి కేవలం ట్రోఫీ మాత్రమే గెలవలేదని, కోట్ల మంది హృదయాలను గెలుచుకుందని సోనీ టీవీ నిర్వాహకులు ట్విట్టర్‌లో క్యాప్షన్ పోస్టు చేశారు.
Manasi Ghosh, a talented singer from Kolkata, won the prestigious title of Indian Idol Season 15.
ఈ సీజన్ ఇండియన్ ఐడిల్ జడ్జిల సపోర్టు గురించి ప్రస్తావించిన మానసి. స్టేజి మీద పాట పాడుతునప్పుడు ఎప్పుడు జడ్జిలు బాద్‌షా, విశాల్ వైపు చేసేదాన్ని అని, విశాల్ ముక్కుసూటిగా, ముఖం మీద తప్పులను చెప్పేవారని, బాగా పాడితే స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చే మొదటి వ్యక్తి అతనేనని చెప్పింది. శ్రేయఘోషాల్ తనపట్ల చాలా కైండ్‌గా ఉండేదని, ఆమె ఇచ్చే సలహాలు, సూచనలు తనకు చాలా ఉపయోగపడ్డాయని అంటోంది మానసి.
Manasi Ghosh, a talented singer from Kolkata, won the prestigious title of Indian Idol Season 15.
మానసి గెలుచుకున్న రూ.25లక్షలను ఏం చేస్తావు, దేనికి ఉపయోగించుకుంటావ్ అని అడిగితే.. తాను ఆ డబ్బుని తిరిగి తన సింగింగ్ కోసమే వెచ్చిస్తానని చెప్పింది. దీంతోపాటు కొంత మొత్తం తన కారు కోసం ఇతర ఖర్చులకు వాడుకుంటానంటోంది. ఇండియన్ ఐడిల్ గెలుచుకున్న మానసి ఘోష్, తన మొదటి బాలీవుడ్ పాటను ఇప్పటికే రికార్డ్ చేశానని చెప్పింది. ప్రముఖ బాలీవుడ్ సింగర్లు లలిత్ పండిట్ షాన్‌లతో కలిసి ఓ పాట పాడినట్లు చెప్పింది. త్వరలోనే ఆ పాట విడుదలవుతుందని చెప్పుకొచ్చింది.