ఖుష్బూ కూతురుని చూశారా? వాహ్‌ పర్‌ఫెక్ట్ స్టార్‌ హీరోయిన్‌ మెటీరియల్‌.. సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

Published : Apr 07, 2025, 09:37 AM IST

Avantika: సీనియర్‌ హీరోయిన్‌ ఖుష్బూ నుంచి వారసులు రాబోతున్నారు. ఆమె కూతురు అవంతిక త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందట. మరి ఆ కథేంటో చూద్దాం.   

PREV
16
ఖుష్బూ కూతురుని చూశారా? వాహ్‌ పర్‌ఫెక్ట్ స్టార్‌ హీరోయిన్‌ మెటీరియల్‌.. సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?
khushbu, avantika

Avantika: ఖుష్బూ హీరోయిన్‌గా తెలుగు, తమిళంలో ఒకప్పుడు ఓ ఊపు ఊపేసింది. స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఇప్పుడు అడపాదడపా తెలుగులో కనిపిస్తున్నా, తమిళంలో మాత్రం ఆమె బిజీగా ఉంటుంది.

అదే సమయంలో చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఆమె కూతురుని సినిమాల్లోకి తీసుకురాబోతుందట. పెద్ద కూతురు అవంతికని హీరోయిన్‌గా పరిచయం చేయడానికి ప్లాన్‌ జరుగుతుందట. 

26
khushbu, avantika khushbu

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ ఖుష్బూ కోలీవుడ్‌ డైరెక్టర్‌, యాక్టర్‌, ప్రొడ్యూసర్‌ సుందర్‌ సి ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. అవంతిక, ఆనందిత. ప్రస్తుతం స్టడీస్‌తో బిజీగా ఉన్నారు వీరిద్దరు.

తమ ఫ్యామిలీ మొత్తం సినిమా ప్రపంచమే అయినా ఇప్పటి వరకు సినిమాల వైపు ఫోకస్‌ పెట్టలేదు. పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితమయ్యారు. ఎప్పుడో అడపాదడపా ఈవెంట్లలో మెరవడం తప్ప పబ్లిక్‌గా కనిపించింది లేదు. 
 

36
avantika

అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఖుష్బూ పెద్ద కూతురు అవంతిక యాక్టీవ్‌గానే ఉంది. ఆమె తన గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. పర్‌ఫెక్ట్ హీరోయిన్‌ మెటీరియల్‌ అనిపించుకుంటుంది. గతంలో టాటూలతో రచ్చ చేసింది. తన బాడీపై వరుసగా టాటూలతో కనిపించింది. కానీ సడెన్‌గా ఆమెలో మార్పు వచ్చింది.

ఇటీవల గ్లామరస్‌గా ముస్తాబై దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. దీంతో భారీగానే ఫాలోయింగ్‌ కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆమె లుక్‌ చూస్తుంటే హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతుందనే సాంకేతాలను ఇస్తుంది. ఫ్యాన్స్ కూడా అదే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆమెని ఆహ్వానిస్తున్నారు. 
 

46
avantika

ఈ క్రమంలో ఇప్పుడు ఖుష్బూ కూతురు గురించి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని, దీనికి సంబంధించిన ప్లాన్‌ జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అవంతిక స్పందించింది.

తన ఇంట్రెస్ట్ ని వెల్లడించింది. సినిమాలంటే ఇష్టమే అని చెప్పింది. కానీ ఎంట్రీ ఇవ్వాలనే తాను ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పింది. నటించాలని ఉందని, కానీ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదని చెప్పింది. 
 

56
avantika

మరో ఇంటర్వ్యూలో అవంతిక రియాక్ట్ అవుతూ, నన్ను సినిమాల్లో పరిచయం చేయాలని మా తల్లిదండ్రులను నేను ఎప్పుడూ కోరలేదు. వారిని అడగడం కూడా సరైనది కాదు, ఇండస్ట్రీలో నేను గొప్ప స్థానంలో ఉంటానని చెబితే అది తప్పే అవుతుంది. అయితే వాళ్లు నన్ను హీరోయిన్‌గా పరిచయం చేయాలని తాను కోరుకోవడం లేదు.

కాకపోతే ఇండస్ట్రీ వ్యక్తులకు పరిచయంచేయాలని మాత్రం కోరతాను` అని వెల్లడించింది అవంతిక. చాలా డిప్లమాటిక్‌గా సమాధానం చెబుతూ, సినిమాల్లోకి రావాలని ఉందనే ఆసక్తిని చెప్పకనే చెప్పింది. మరి హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? అనేది తెలియాల్సి ఉంది. 
 

66
extra jabardasth promo

ఇక ఇప్పుడు సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న ఖుష్బూ తెలుగు ఆడియెన్స్ కి మాత్రం టచ్‌లోనే ఉంది. ఆమె తెలుగు కామెడీ షో `జబర్దస్త్`కి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. గత రెండేళ్లుగా ఆమె ఈ షో చేస్తుంది. బుల్లి తెర ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఇక తెలుగులో ఖుష్బూ చివరగా గోపీచంద్‌ `రామబాణం` చిత్రంలో నటించింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories