తనకు నచ్చినవారికి ప్రభాస్ ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా.? వింటే ఆశ్చర్యపోతారు

Published : Jan 22, 2026, 08:00 AM IST

Prabhas: బాహుబలి 1 & 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. సంక్రాంతికి 'ది రాజా సాబ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. 

PREV
15
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

మాములుగా హీరోగా 'ఈశ్వర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా తెగ ఫేమస్ అయ్యాడు నటుడు ప్రభాస్. బాహుబలి 1 & 2, సాహో లాంటి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ సంపాదించాడు. ఇప్పుడు వరుసపెట్టి భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

25
ప్రభాస్ మంచి మనసు..

రీల్‌లో బాహుబలి మాదిరిగా ఉండే ప్రభాస్.. రియల్‌లో మాత్రం అటు అభిమానులకు, ఇటు కో-స్టార్స్‌కి డార్లింగ్‌గా మారాడు. సెట్స్‌లో చిన్నవాళ్ల దగ్గర నుంచి బడా స్టార్ల వరకు అందరినీ సమానంగా చూస్తాడు. ప్రభాస్ ది ఎంతో మంచి మనసు అని ఇప్పటికే చాలామంది స్టార్లు చెప్పిన సందర్భాలు లేకపోలేదు.

35
ఫుడ్ పెట్టి..

ప్రభాస్ తనకు నచ్చినవారికి మర్చిపోలేని గిఫ్ట్‌లు ఇవ్వడంతో పాటు.. తరచూ వారికి తన ఇంటి నుంచి వివిధ రకాల భోజనాలను పంపిస్తుంటాడట. అటు తన కో-స్టార్స్‌కి కూడా షూటింగ్ స్పాట్‌లకు ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

45
ప్రభాస్ క్లోజ్ అయితే..

ప్రభాస్ ఎవరితోనైనా క్లోజ్ అయితే.. కచ్చితంగా వారికి ఓ వాచ్ కానుకగా వెళ్తుందని సమాచారం. ప్రభాస్ ఇలా తన ప్రాణ స్నేహితులకు గిఫ్ట్‌గా వాచ్‌ను కానుకగా పంపిన సంగతి తెలిసిందే. అలాగే ఒకవేళ ఓ సినిమా షూటింగ్ తనకు నచ్చితే.. ఆ చిత్ర బృందానికి కూడా గిఫ్ట్స్ ఇచ్చాడు ప్రభాస్.

55
ఎంతోమంది ఆ కానుకను..

ఇప్పటికే ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు, కొరియోగ్రాఫర్లు, దర్శకులతో పాటు రియల్‌గా తన నచ్చినవారికి కూడా ప్రభాస్ ఇలా వాచ్‌లను కానుకగా పంపించారని తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories