Chiranjeevi: ఒక్క ఈ సంక్రాంతి మాత్రమే కాదు.. గతంలోనూ తన సినిమాలను సంక్రాంతి పండుగకు విడుదల చేసి ప్రేక్షకులను అలరించారు చిరంజీవి. మరి ఈ సంక్రాంతి రేసులో చిరంజీవి తన కెరీర్‌లో ఎన్ని హిట్స్ కొట్టారో ఇప్పుడు తెలుసుకుందామా..
ఎప్పటిలానే ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ హీరోలు తమ సినిమాలతో సిద్దమైపోయారు. ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ 'ది రాజా సాబ్' విడుదల కాగా.. చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీనారీ నడుమ మురారి' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
25
చిరంజీవి సంక్రాంతి సెంటిమెంట్..
చిరంజీవి, సంక్రాంతికి విడదీయరాని అనుబంధం ఉంది. బాక్సాఫీస్ దగ్గర ప్రతీ సంక్రాంతికి చిరంజీవి తన సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తన కెరీర్‌లో దాదాపుగా 15కిపైగా సినిమాలు సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయగా.. అందులో 70 శాతంపైగా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు 'మన శంకరవరప్రసాద్ గారు'తో వచ్చేస్తున్నారు చిరంజీవి.
35
హిట్ సినిమాలు ఇవే..
1993లో 'ముఠా మేస్త్రి' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ కొట్టింది. మాస్ ఆడియన్స్‌లో చిరు ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. 1997లో 'హిట్లర్' సినిమాతో చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది. ఆపై 1999లో 'స్నేహం కోసం', 2000లో 'అన్నయ్య', 2017లో 'ఖైదీ నెంబర్ 150', 2023లో 'వాల్తేరు వీరయ్య' చిరంజీవికి సంక్రాంతి పండుగ నాడు హిట్ ఇచ్చిన చిత్రాలు.
2001లో 'మృగరాజు' భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్‌గా మిగిలింది. ఆపై 2004లో 'అంజి' చిత్రం గ్రాఫిక్స్‌కు ప్రశంసలు దక్కినా, కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. మొత్తానికి చిరంజీవికి సంక్రాంతి సినిమాల్లో మంచి సక్సెస్ రేటు ఉందని చెప్పొచ్చు. రాజకీయాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన సంక్రాంతికి రిలీజ్ చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి.
55
ఈ ఏడాది పోటీ..
ప్రభాస్ 'ది రాజా సాబ్'తో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' ఈ సంక్రాంతికి పోటీ పడుతోంది. ఈ రెండు పెద్ద చిత్రాలు కావడంతో వీటిపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టైటిల్, ట్రైలర్, దర్శకుడి ట్రాక్ రికార్డు చూస్తుంటే.. ఈ సంక్రాంతికి కూడా బాస్ మళ్లీ హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు.