సంజయ్ దత్...ఆయన్ని బాలీవుడ్ సంజు బాబా అని ముద్దుగా పిలుచుకుంటూంటుంది. అతని కెరీర్ చుట్టూ వివాదాలు, జీవితంలో ఎన్నో సమస్యలు , అనారోగ్యాలు అన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అతను ఎలాంటివాడైనా ఏమైనా తమకు ఇష్టమే అనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంజు సొంతం. మున్నాభాయ్ లాంటి సినిమాలు సంజయ్ దత్ మాత్రమే చేయగలరని అంతా నమ్ముతారు. ఆ ఫెరఫార్మెన్స్ వేరొకరి సొంతం అయితే కాదు. అలాగే చిన్నప్పటి నుంచి సంజయ్ దత్ కు లగ్జరీ లైఫ్. విపరీతంగా ఖర్చుపెడతాడు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ క్రమంలో ఆయన సంపాదించింది ఎంత..అసలు ఆయన ఆస్తి ఎంత ఉండవచ్చు.
ఈ 65 సంవత్సరాల నటుడు పుట్టకతోటే ఆస్తిపరుడు.హిందీ సినిమాలో పాపులర్ అయిన సునీల్ దత్, నర్గీస్ దత్‌లకు సంజయ్ దత్ జన్మించాడు. రాకీ సినిమాతో సంజయ్ బాలీవుడ్‌లో ప్రవేశించాడు. తొలి చిత్రం రాకీ విడుదలకు మూడు రోజుల ముందు తల్లి నర్గీస్ మరణించింది.
బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనందటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంజయ్ దత్ స్దిరం చేసుకున్నాడు. కామెడీ నుంచి రోమాన్స్ వరకు ఏది పడితే అది చేశాడు. విజయాలను అందుకున్నాడు. గ్యాంగస్టర్, పోలీసు వంటి పాత్రలు అతనికి ప్రత్యేకతను, పేరును సంతరించి పెట్టాయి. 1986 లో వచ్చిన నామ్ సినిమా సంజయ్ దత్ కెరీర్ ని నెక్ట్స్ లెవివ్ కు తీసుకెళ్లింది. తర్వాత వరస ప్లాఫ్ ల వర్షం కురిసినా మున్నాభాయ్ MBBS భారీగా కమర్షియల్ సక్సెస్ కావటం ఆయన స్టామినా మరోసారి ఇండస్ట్రీకి తెలిసేలా చేసింది.
నటి రిచా శర్మను వివాహమాడాడు. మెదడులో కణితితో ఆమె 1996లో మరణించింది. వారికి తిషాలా అనే కూతురు జన్మించింది. ఆ తర్వాత మోడల్ రియా పిళ్లైను వివాహమాడి 2005లో విడాకులు తీసుకున్నాడు. మున్నాబాయ్ సినిమాతో హిట్ కొట్టిన సంజయ్ దత్ 2005లో గోవాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాన్యతను పెళ్లి చేసుకున్నాడు. మాన్యతతో ఆయనకు కవలలు జన్మించారు. కుమారుడికి షహ్రాన్ అని, కూతురికి ఇఖ్రా అని పేర్లు పెట్టుకున్నారు.
కెరీర్ తొలినాళ్లలో ఖల్‌నాయక్, వాస్తవ్, ఆ తర్వాత అగ్నిపథ్‌లాంటి మూవీల్లో విలన్ పాత్ర పోషించిన సంజయ్ దత్.. మళ్లీ కేజీఎఫ్ చాప్టర్ 2లో నెగటివ్ పాత్రలో కనిపించాడు. ఈ మూవీ పెద్ద హిట్ కావడంతోపాటు సంజయ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
ఇక సంజయ్ దత్ ఆస్ది విషయాలకు వస్తే Rs. 295 కోట్లు అని బాలీవుడ్ పాపులర్ మీడియా అంచనా. ఆయన ఆస్దుల్లో ఎక్కువ శాతం తను నటించిన, నిర్మాతగా చేసిన, బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన వాటినుంచి వచ్చివే. కేవలం నటుడుగానే కాకుండా బిజినెస్ లో కూడా సంజయ్ దత్ పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.
సంజయ్ దత్ ఆస్దుల్లో చెప్పుకోదగ్గది 40 కోట్ల విలువ చేసే పలై హిల్స్ లో ఇల్లు. ఆయన గ్రాండ్ లైప్ కూడా అద్బుతంగా ఉంటుంది. ఇక ఫామ్ లో ఉన్న టైమ్ లో సంజయ్ దత్ హీరోగా చేసేటప్పుడు 12 కోట్లు రెమ్యునరేషన్ ఓ సినిమాకు తీసుకునేవారు. అలాగే బ్రాండ్ ని ఎండార్స్ చేయాలంటే 6 కోట్లు దాకా వసూలు చేసేవారు.
Sanjay Dutt about past life
అలాగే కేజీఎఫ్ చాప్టర్ 2 , ‘లియో’ తర్వాత సంజయ్ దత్ మార్కెట్ ఒక్కసారిగా రెట్టింపు అయ్యిందన్న సంగతి తెలిసిందే. వరసపెట్టి సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆయనకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. . ఇప్పుడు రామ్ హీరోగా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’లో విలన్ గా కనిపించబోతున్నాడు. అలాగే ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న `రాజాసాబ్` లోనూ తనకు ఓ అత్యంత కీలకమైన పాత్ర దక్కింది. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు కూడా ఆయన్ను అడుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు.
హిందీ మార్కెట్ లోనూ తమ సినిమాలను దించాలనుకున్నప్పుడు సంజయ్ దత్ అందరికీ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నారు. దాంతో తెలుగు సినిమాల్లో సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ స్టార్ కనిపించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే సంజయ్ దత రెమ్యునరేషన్ సైతం పెంచేసినట్లు తెలుస్తోంది.
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా రూ.8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. . ఇప్పుడు ప్రభాస్ సినిమా `రాజాసాబ్` కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేసి తీసుకుంటున్నారట. పది కోట్లూ ప్లస్ ఆయన ఖర్చులు అదనంగా మరో రూ.2 కోట్ల వరకూ అవుతాయని చెప్తున్నారు.
ముంబై నుంచి ఇక్కడకి రావటానికి స్పెషల్ ప్లైట్ ఎరేంజ్ చేస్తారు. అలాగే ఆయన టీమ్ లో మొత్తం ఎనిమిదిమంది స్టాఫ్ ఉంటారని, వాళ్ల జీతాలు, బేటాలు,ఎకామ్డేషన్ అన్నీ… నిర్మాతలే చూసుకోవాలి అంటున్నారు. ఈ రకంగా నిర్మాతలు చాలా బడ్జెట్ అవుతోంది. అయితే సంజయ్ దత్ ఉండటంతో బిజినెస్ సైతం అదే విధంగా అవుతోందిట.
ఇక రామ్ చరణ్ ,బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రం ఎనౌన్సమెంట్ రావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది. ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రల కోసం ఇప్పుడు ఆర్టిస్ట్ ల ఎంపిక జరుగుతోంది. అందులో భాగంగా ఈ చిత్రం విలన్ ని సెట్ చేసారని సమాచారం. ఈ చిత్రంలో సంజయ్‌దత్ విలన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే చిత్రటీమ్ ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. కథ, తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఆయన ఓకే అన్నారని, ఎగ్రిమెంట్ అయ్యాకనే ఎనౌన్సమెంట్ వస్తుందని కథనాలు వెలువడుతున్నాయి.