తనని పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికి సాయిధరమ్‌ తేజ్‌ రెండు కండీషన్లు.. రూమర్లపై ఏం చెప్పాడంటే?

Published : Jul 29, 2024, 12:55 AM IST

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ కి సంబంధించిన పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చాడు సాయి తేజ్‌. కాబోయే భార్యకి కండీషన్లు కూడా పెట్టాడు.   

PREV
15
తనని పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికి సాయిధరమ్‌ తేజ్‌ రెండు కండీషన్లు.. రూమర్లపై ఏం చెప్పాడంటే?

 మెగా ఫ్యామిలీలో గతేడాది చివర్లోనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు తమ ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 

25

సాయిధరమ్ తేజ్‌ మ్యారేజ్‌కి సంబంధించిన రూమర్లు ఊపందుకుంటున్నాయి. మెహరీన్‌తో మ్యారేజ్‌ అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించారు సాయిధరమ్‌ తేజ్‌. అవేవీ నిజం కాదని తెలిపారు. తాను సోలో బతుకే సో బెటర్‌ అనేలా ఉన్నానని, ప్రస్తుతానికి పెళ్లి కాని ప్రసాద్‌ ని అని, అప్పుడే పెళ్లి రూమర్లతో తనని బుక్‌ చేయోద్దని, ట్రై చేసుకునే స్కోప్‌ ఇవ్వాలని నవ్వుతూ తెలిపారు సాయిధరమ్‌ తేజ్‌. 
 

35

ఈ సందర్భంగా తనని పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు గురించి అడిగారు యాంకర్‌. దీనికి ఆయన స్పందిస్తూ రెండు కండీషన్లు పెట్టాడు. తనని పెళ్లి చేసుకునే అమ్మాయి రెండు విషయాలు కచ్చితంగా పాటించాలని, ఒకటి సోషల్‌ మీడియాకి దూరంగా ఉండాలని, రెండోది మా అమ్మకి నచ్చాలని తెలిపారు. ఈ రెండు విషయాల్లో పాజిటివ్‌గా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు సాయిధరమ్‌ తేజ్. 
 

45

దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ రూపొందించిన `ఉషా పరిణయం` సినిమా ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చిన సాయిధరమ్‌ తేజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన రూపొందించిన `నువ్వే కావాలి`, `నువ్వు నాకు నచ్చావ్‌`, `మల్లీశ్వరి` చిత్రాలంటే ఇష్టమని తెలిపారు సాయి దుర్గ తేజ్‌.
 

55

రోడ్డు ప్రమాదం కారణంగా కోమాలోకి వెళ్లిన సాయిధరమ్‌ తేజ్‌ కోలుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన మూడు సినిమాల్లో మెరిశారు. `వీరూపాక్ష`తో హిట్‌ కొట్టాడు. `బ్రో` డిజప్పాయింట్‌ చేసింది. `సత్య` అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఇప్పుడు మరో భారీ పాన్‌ ఇండియా సినిమాకి రెడీ అవుతున్నాడు. `హనుమాన్‌` నిర్మాతలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకేష్‌ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. 1940 బేస్డ్ గా ఈ మూవీ సాగబోతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories