Klinkaara Look Leak: రామ్‌ చరణ్‌ అడ్డంగా దొరికిపోయాడు.. క్లీంకార లుక్‌ లీక్‌, ఎంత క్యూట్‌గా ఉందో

Published : Feb 15, 2025, 07:57 PM IST

Klinkaara Look Leak: రామ్‌ చరణ్‌ తన కూతురు క్లీంకారని పరిచయం చేయడానికి ఇంకా టైమ్‌ ఉందన్నారు. కానీ ఆయన చేసిన పొరపాటు వల్ల క్లీంకార లుక్‌ లీక్‌ అయ్యింది. వైరల్‌ అవుతుంది.

PREV
15
Klinkaara Look Leak: రామ్‌ చరణ్‌ అడ్డంగా దొరికిపోయాడు.. క్లీంకార లుక్‌ లీక్‌, ఎంత క్యూట్‌గా ఉందో
ram charan, klinkaara

Klinkaara Look Leak: సెలబ్రిటీ లైఫ్‌ స్టయిల్‌పై, సెలబ్రిటీల ఫ్యామిలీ విషయాలు, వారు చేసే పనులు, ఫుడ్‌, దుస్తులు, కార్లు, ఇళ్లు ఏదైనా జనాలకు ఆసక్తికరంగా ఉంటాయి. వారి గురించి తెలుసుకోవాలనుకుంటారు. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కూడా ఎప్పుడూ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంటాయి. అయితే వారికి సంబంధించిన మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేసే అంశం ఒకటుంది. అదే మెగా మనవరాలుని ప్రపంచానికి పరిచయం చేయడం. ఆ చిన్నారి ఫేస్‌ ఫ్యాన్స్ కి చూపించడం. 

25
Ram Charan

క్లీంకార రెండేళ్ల క్రితం జన్మించింది. ఇప్పటి వరకు ఆ చిన్నారి ఎలా ఉంటుందో తెలియదు. ప్రతిసారి కవర్‌ చేస్తూ వచ్చారు. క్లీంకార తనని నాన్న అని పిలిచినప్పుడు తాను పరిచయం చేస్తానని తెలిపారు రామ్‌ చరణ్‌. ఇటీవల `గేమ్‌ ఛేంజర్‌` ప్రమోషన్స్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

35
ram charan, klinkaara

కానీ ఇప్పుడు క్లీంకార లుక్‌ లీక్‌ అయ్యింది. రామ్‌ చరణ్‌ ఎత్తుకుని తీసుకెళ్తుండగా, ఎవరో కెమెరాలో చిత్రీకరించారు. దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో క్లీంకార ఎంతో క్యూట్‌గా ఉంది. చూడబోతుంటే రామ్‌ చరణ్‌ పోలికలే కనిపిస్తున్నాయి. ఇది చూసి ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. వైరల్‌ చేస్తున్నారు. 
 

45

రామ్‌ చరణ్‌ తన కూతురుని చాలా గ్రాండ్‌గా అభిమానులకు పరిచయం చేద్దామనుకున్నారు. కానీ తనే పొరపాటుని లీక్‌ చేశాడు. దీంతో కెమెరాకి అడ్డంగా దొరికిపోయాడు. అనధికారికంగా ఇప్పుడు క్లీంకార వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతుంది. మెగా ఫ్యాన్స్ నే కాదు, సాధారణ నెటిజన్లు కూడా హ్యాపీ అవుతుంది. 
 

55
ram charan

ఇక రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో `ఆర్‌సీ16` చిత్రంలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో గుండివాడుగా రామ్‌ చరణ్‌ కనిపిస్తాడని తెలుస్తుంది. స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కుతుంది. క్రికెట్‌, కబడ్డీ ఆటల ప్రధానంగా సాగుతుందని, శివ రాజ్‌ కుమార్‌ కోచ్‌గా కనిపిస్తాడని సమాచారం. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. 

read more: Laila: `లైలా` డిజాస్టర్‌కి కారణాలు, విశ్వక్‌ సేన్‌ చేసిన మిస్టేక్‌ ఇదే? ఫస్ట్ డే కలెక్షన్లు తెలిస్తే షాకే

also read: Ibomma: పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కి రెడీ అయితే ఇలా జరిగిందేంటి..క్రేజీ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అదుర్స్

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories