Laila: `లైలా` డిజాస్టర్‌కి కారణాలు, విశ్వక్‌ సేన్‌ చేసిన మిస్టేక్‌ ఇదే? ఫస్ట్ డే కలెక్షన్లు తెలిస్తే షాకే

Published : Feb 15, 2025, 06:34 PM IST

Laila Movie: విశ్వక్‌ సేన్‌ ఈ శుక్రవారం `లైలా` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కానీ  ఈమూవీ దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మరి సినిమా ఇంతటి డిజాస్టర్‌ కి కారణమేంటనేది చూస్తే. 

PREV
16
Laila: `లైలా` డిజాస్టర్‌కి కారణాలు, విశ్వక్‌ సేన్‌ చేసిన మిస్టేక్‌ ఇదే? ఫస్ట్ డే కలెక్షన్లు తెలిస్తే షాకే
laila movie

Laila Movie: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ క్రేజీ హీరోగా రాణిస్తున్నారు. ఆయన సినిమాలకు కూడా అదే స్థాయిలో క్రేజ్‌ ఉంటున్నాయి. అయితే తన ఇమేజ్‌గానీ, తన సినిమాలకు ఆదరణ గానీ తనకు తాను క్రియేట్‌ చేసుకున్నదే. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా స్వతహాగా ఎదిగిన హీరో విశ్వక్‌ సేన్‌. `ఫలక్‌నూమా దాస్‌` చిత్రంతో దర్శకుడిగా, హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు అదే యాటిట్యూడ్‌తో రాణిస్తున్నారు. 

26
laila movie

కానీ ఇటీవల విశ్వక్‌ సేన్‌కి టైమ్‌ కలిసి రావడం లేదు. వరుసగా పరాజయాలు వెంటాడుతున్నాయి. `హిట్‌` మూవీ తర్వాత గట్టిగా చెప్పుకునే హిట్‌ లేదు. `ధమ్కీ`, `గామి`, `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`, `మెకానిక్‌ రాఖీ` ఇలా వరుసగా పరాజయాలు చెందాయి. మధ్యలో `అశోకవనంలో అర్జునుడు` వంటి చిత్రాలు ఫర్వాలేదనిపించాయి.

ఈ క్రమంలో విశ్వక్‌ సేన్‌కి కమర్షియల్‌ బ్రేక్‌ లేక చాలా కాలం అవుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో తాజాగా ఆయన `లైలా` అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇందులో లేడీ గెటప్‌ వేయడంతో మంచి క్రేజ్‌  నెలకొంది. దీనికితోడు తనదైన వివాదాలు కూడా ఈ మూవీని వెంటాడాయి. 
 

36
laila movie

విశ్వక్‌ సేన్‌ సినిమా అంటే కాంట్రవర్సీ ఉండాల్సిందే అనేట్టుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం విడుదలైన `లైలా` మూవీకి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ షో నుంచే డిజాస్టర్‌ టాక్‌ వినిపించింది. అదే కంటిన్యూ అవుతుంది.

ఆ టాక్‌ సినిమా ఓపెనింగ్స్ పై పడింది. ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కోటీ రూపాయలకంటే తక్కువగానే వచ్చాయని సమాచారం. ఇది ఓ రకంగా జీరోషేర్‌ అని చెప్పాలి. ఒక నోటెడ్‌ హీరో సినిమాకి ఇలాంటి కలెక్షన్లు రావడం బిగ్గెస్ట్ డిజాస్టర్‌ అనే చెప్పాలి. 

46
laila movie

మరి `లైలా` పరాజయానికి కారణమేంటి? విశ్వక్‌ సేన్‌ చేసిన మిస్టేక్‌ ఏంటి? అనేది చూస్తే, ఇందులో బలమైన ఎమోషనల్‌ లేదు. ఫన్‌ నమ్ముకున్నారు. కానీ అది తెరపై వర్కౌట్‌ కాలేదు. అమ్మ సెంటిమెంట్‌ అనేది చాలా బలమైన పాయింట్‌ కానీ దాన్ని ఎలివేట్‌ చేయలేదు, దానిచుట్టూ కథని నడిపించలేకపోయారు,

దీంతో సినిమా సైడ్‌ ట్రాక్‌ తీసుకుంది. సినిమా తీసిన ప్రధాన ఉద్దేశ్యం ఫన్‌, కామెడీ, కానీ ఇందులో అదే మిస్‌ అయ్యింది, ఇరికించిన ఫన్‌ లాగా ఉండటంతో అది ఆడియెన్స్ కి నవ్వులు పూయించలేకపోయింది. 
 

56
laila movie

పేలవమైన స్క్రీన్‌ ప్లే, అంతా ఊహించేలా ఉంది. ఏదీ కొత్తగా లేదు, లైలాగా మారిన కారణం కూడా బలంగా లేదు. సిల్లీగా ఉంది. ఇందులో విశ్వక్‌ సేన్‌ కంటే విలన్‌ పాత్ర హైలైట్‌ అయ్యింది. అలాగే పృథ్వీరాజ్‌ని ఇరికించే యూట్యూబ్‌ సెలబ్రిటీ పాత్ర హైలైట్‌ అయ్యింది. వీరి ముందు విశ్వక్‌ రోల్‌ డల్‌ అయిపోయింది.

అంతేకాదు లైలాగా వాయిస్‌ ఒక్కటి మారింది కానీ, ఆ పాత్రలో విశ్వకే కనిపిస్తున్నారు, అందుకే సహజత్వం మిస్‌ అయ్యింది. పాటలు రొటీన్‌, బీజీఎం పరమ రొటీన్‌గా ఉంది. సినిమాలో ఏదీ కొత్తదనం లేదు, ఎంగేజ్‌ చేసే ఎలిమెంట్‌ లేదు. ఎమోషన్స్ అసలే లేదు. సినిమాకంటూ ఒక సోల్‌ ఉంటుంది. ఇందులో అది మిస్‌ అయ్యాయి. 
 

66

ఇవన్నీ ఓ ఎత్తైతే విశ్వక్‌ చేసే హడావుడి కూడా మరో కారణం అవుతుంది. ఆయన ఈవెంట్లలో చేసే యాటిట్యూడ్‌ విషయాలు కూడా ఆయన సినిమాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ట్రోల్‌కి కారణమవుతున్నాయి. వివాదాలు మరో కారణంగా నిలుస్తున్నాయి. ఏదేమైనా విశ్వక్‌ సేన్‌ కి మరో డిజాస్టర్‌ పడింది. అయితే ఇది కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టకపోవడం విచారకరం. ఇది విశ్వక్‌ మార్కెట్‌ పడిపోవడానికి కారణమవుతుందని చెప్పొచ్చు.

ప్రారంభంలో కంటెంట్‌కి ప్రయారిటీ ఇచ్చిన విశ్వక్‌ ఇప్పుడు కమర్షియల్‌ సినిమాలు వెంటపడుతున్నాడు. అవి బెడిసి కొడుతున్నాయి. ఎప్పటికైనా కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అనేది ఆయన గుర్తుపెట్టుకుని, మంచి కంటెంట్‌ సినిమాలతో వస్తేనే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మరిన్ని దెబ్బలు తప్పవు. మరి ఇకనైనా తన తప్పులు తెలుసుకుని మంచి సినిమాలతో వస్తారేమో చూడాలి. 

read  more: సాయిపల్లవి కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఏంటో తెలుసా? కుర్రాళ్లని ఊపేసిన డాన్స్ అది.. అస్సలు ఊహించరు!

also read: ఎన్టీఆర్‌ సినిమా డైరెక్టర్‌కి 50 కోట్ల పారితోషికం, లాభాల్లో షేర్‌, నిర్మాతలు అడ్వాన్స్ చెక్‌.. ఎవరా దర్శకుడు ?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories