60 లక్షలు బడ్జెట్, గీతా సింగ్ హీరోయిన్, 10 కోట్లు వసూలు చేసిన కామెడీ మూవీ ఏదో తెలుసా?

Published : Aug 08, 2025, 05:29 PM IST

కొన్నిసినిమాలు అసలు నడుస్తాయా లేదా అన్న డౌట్ తో రిలీజ్ అవుతాయి. కొన్ని సినిమాలు అందులో యాక్టర్స్ ను బట్టి నడుస్తాయి. అయితే  ఓ కామెడీ సినిమా రిస్క్ చేసి తీస్తే ఊహించని లాభాలు తెచ్చిపెట్టిన సందర్భం టాలీవుడ్ లో జరిగింది. ఇంతకీ ఏంటా సినిమా? 

PREV
16

చిన్న బడ్జెట్, పెద్ద విజయం

ఇండస్ట్రీలో భారీబడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయితే, మరికొన్నిమాత్రం డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచ అందులో ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా ప్లాప్ అవుతుంది అనేది చెప్పలేం. కంటెంట్ బాగుంటే చాలు బడ్జెట్ తో పనిలేకుండా చిన్న సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. హీరో హీరోయిన్లతో పనిలేకుండా, కమెడియన్లను పెట్టి తెరకెక్కించిన మూవీస్ కూడా అద్భుతంగా నడిచిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సినిమా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ సినిమా అసలు ఆడుతుందా లేదా అని కామెంట్లు చేశారు. 16 లక్షల బడ్జెట్ లో నిర్మించిన ఈ కామెడీ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాదాపు 30 కోట్లకు పైగా కలెక్షన్స్ ను ఖాతాలో వేసుకుంది.

DID YOU KNOW ?
సినిమా కోసం ఆస్తి అమ్మిన దర్శకుడు
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తాను డైరెక్ట్ చేస్తూ నిర్మించిన కితకితలు సినిమా కోసం డబ్బులు సరిపోక తనకు ఇష్టమైన లాండ్ ను అమ్మేశారు. దాదాపు 60 లక్షలతో నిర్మించిన కితకితలు సినిమా 10 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది
26

కితకితలు పెట్టించిన సినిమా

ఆ సినిమా మరేదో కాదు కితకితలు. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన కితకితలు సినిమాలో ఆయన తనయుడు అల్లరి నరేష్ హీరోగా, లేడీ కమెడియన్ గీతా సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈసినిమా బాక్సాపీస్ దగ్గర భారీగా ప్రభావం చూపించింది. థియేటర్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకూ కడుపుబ్బా నవ్వించడంతో పాటు, సెంటిమెంట్ తో కన్నీరు కూడా పెట్టించింది సినిమా. భార్య లావుగా ఉందని నామూషీపడుతున్న భర్తను, ఆమె ఎలా మార్చుకుంది అనేది ఈసినిమా కథ. ఈమూవీ చాలా కుటుంబాలకు కనెక్ట్ అయ్యింది. నవ్వులకు నవ్వులు, సెంటిమెంట్ కు సెంటిమెంట్ ఈరెండు ఎలిమెంట్స్ ఆడియన్స్ ను ఈ సినిమా వైపు నడిపించాయి. అయితే ఈసినిమా వెనుక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ జరిగింది. ఈ విషయాన్ని ఈసినిమాలో నటించిన హీరోయిన్ గీతా సింగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

36

గీతాసింగ్ కామెంట్స్

లేడీ కమెడియన్ గీతాసింగ్ మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. కితకితలు సినిమాలో హీరోయిన్ అనే విషయాన్ని నమ్మలేకపోయాన్నన్నారు. గీతాసింగ్ మాట్లాడుతూ.. '' ఎవడిగోల వాడిదే సినిమా చేసిన తరువాత ఈవీవీ గారు పిలిచారు. ఓ మూడు నెలలు నీ డేట్స్ కావాలి అన్నారు. నేను కమెయిన్ ను నాతో అన్ని డేట్స్ ఏం చేసుకుంటారా అని డౌట్ వచ్చింది. ఓ సినిమా చేస్తున్నాం.. కామెడీ సినిమా నువ్వు ఇంకా బరువు పెరగాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి అదే పనిలో ఉండు అన్నారు. అయితే ఏంటి ఇంత ఇంపార్టెంట్ పాత్ర ఏంటా అని అనుకున్నారు. అప్పుడు ఆయన నా నెక్ట్స్ సినిమాలో నువ్వే హీరోయిన్ వి అని అన్నారు. నేను ఒక్క క్షణం నమ్మలేకపోయాను. హీరో ఎవరో తెలుసా అని అడిగారు. నేను జనరల్ గా గెస్ చేసిన నరేష్ గారేనా అని అడిగాను. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావ్ అని అన్నారు. అంతకు ముందు ఎవడిగోల వాడిదే సినిమా ఆర్యన్ రాజేష్ తో చేశారు కదా.. ఇప్పుడు నరేష్ గారితో చేస్తున్నారేమో అని కాజ్యూవల్ గా అన్నాను. దాంతో అవును నరేష్ తో సినిమా నువ్వు బరువుపెరగాలి అని అసలు కాన్సెప్ట్ చెప్పారు. ఈ మాట చెపితే మా నాన్న షాక్ అయ్యారు. మా ఇంట్లో వాళ్లు నమ్మలేకపోయారు అని అన్నారు గీతాసింగ్.

46

ఆమె హీరోయిన్ ఏంటి అన్నారు..

గీతాసింగ్ మాట్లాడుతూ.. '' నన్న ఈ సినిమా నుంచి తీసేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. గీతాసింగ్ హీరోయిన్ ఏంటి. మరోసారి ఆలోచించండి అని ఈవివిగారికి చాలామంది ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేసి మరీ చెప్పారు. గీతాను హీరోయిన్ గా పెడితే ఎవరు సినిమా చూస్తారు. సినిమా ఆడకపోతే ఇబ్బంది అవుతుంది. ఈ పాత్ర కోసం గీతలాగే చాలామంది స్టార్స్ ఉన్నారు. వారిని తీసుకోవచ్చు కదా అని చాలామంది సలహాలు కూడా ఇచ్చారు. కాని ఆయన ఒక్క సారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినడు. అది ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఈ పాత్రకు గీతాసింగ్ మాత్రమే కరెక్ట్ ఆమెను తప్ప ఎవరినీ తీసుకోను అని నిక్కచ్చిగా చెప్పేశారు. సినిమా కోసం అడ్వాన్స్ గా చెక్ ఇస్తుంటే మానాన్న గారు వద్దు అన్నారు. ఇంత మంచి ఆఫర్ ఇచ్చారు రెమ్యునరేషన్ లేకుండా చేస్తాను అని అన్నాను. కాని ఈవీవీగారు దానికి ఒప్పుకోలేదు. చెక్ తీసుకునేవరకూ వదిలిపెట్టలేదు.

56

16 లక్షలు పెడితే 30 కోట్లు వచ్చాయి.

ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ గీతాసింగ్ ఏమన్నారంటే? '' నేను ఈసినిమాలో నటిస్తున్నాను కాని చాలా భయంగానే ఉంది. ఎందుకంటే అప్పటికే ఈవీవీగారు ఆర్ధికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన తన సెంటిమెంట్ గా ఉంచుకున్న ప్లేస్ ను కూడా అమ్మారు. దాంతో ఈ సినిమా ప్లాప్ అయితే ఆయన చాలా ఇబ్బందుల్లోకి వెళ్తారు. అందుకే సినిమా హిట్ అవ్వాలని ప్రతీ రోజు దేవుడిని ప్రార్ధించాను. అనుకున్నట్టే మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. నన్న విమర్శించిన వారే ఆతరువాత ఫోన్ చేసి ఇంత బాగా చేశావమ్మ అని కితాబిచ్చారు. అది నా జీవితంలో మర్చిపోలేను. అంతే కాదు ఈసినిమాకు 16 లక్షలు బడ్జెట్ పెడితే 10 కోట్ల వరకూ లాభం వచ్చింది. అదినాకు చాలా సంతోషం అనిపించింది.'' అని అన్నారు గీతాసింగ్.

66

గీతాసింగ్ ను ఏడిపించిన నరేష్

గీతా సింగ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ఎలా వస్తుందా అని టెక్షన్ తో నేను మూవీ ప్రివ్యూకి కూడా వెళ్లలేదు. కాని హిట్ అయ్యిందనితెలిసి ఎగిరి గంతేశాను. నా పాత్రకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు . చాలామంది ఆడియన్స్ మా ఫ్యామిలీలో జరిగేది సినిమాగా చేశావమ్మా అని అన్నారు. ఒకావిడ అయితే నా భర్త అల్లరి నరేష్ లా ఉంటాడు, నేను మీలాగా ఉన్నాను కదా.. చూడండి అని అడిగేవారు. ఈ సినిమాను ఓ థియేటర్ లో చూడటానికి టీమ్ అంతా వెళ్లాము.. నా పక్కన గిరిబాబుగారు కూర్చున్నారు. ముందు సీట్ లో నరేష్ ఉన్నారు. సినిమా అంతా చూసి గిరిబాబుగారు అద్భుతంగాచేశావమ్మా.. నీకు తిరుగులేదు అన్నారు. ఇక సినిమా అంతా అయిపోయిన తరువాత నరేష్ లేచి చప్పట్లు కొడుతూ.. ఈసినిమాతో నాకన్నా నీకే ఎక్కువ పేరు, ఫ్యాన్స్ వస్తారమ్మా అని అన్నారు. ఆమాటతో నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి అన్నారు గీతా సింగ్. " ఇలా కితకితలు సినిమాతో హీరోయిన్ గా మారిన గీతా.. ఆతరువాత కొన్ని సినిమాల్లో కనిపించింది. కాని స్టార్ యాక్ట్రస్ కాలేకపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories