'బకాసుర రెస్టారెంట్' మూవీ రివ్యూ.. కమెడియన్ ప్రవీణ్ హీరోగా నటించిన చిత్రం ఎలా ఉందంటే ?

Published : Aug 08, 2025, 04:37 PM IST

కమెడియన్ ప్రవీణ్ హీరోగా నటించిన బకాసుర రెస్టారెంట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం హిట్టా ఫట్టా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
'బకాసుర రెస్టారెంట్' మూవీ రివ్యూ

నటుడు ప్రవీణ్ టాలీవుడ్ లో కమెడియన్ గా రాణిస్తున్నారు. ప్రవీణ్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ బకాసుర రెస్టారెంట్ అనే చిత్రంలో నటించాడు. ఎస్ జె శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వైవా హర్ష మరో ప్రధాన పాత్రలో నటించారు. గరుడ రామ్, కృష్ణ భగవాన్, షైనింగ్ ఫణి ఇతర పాత్రల్లో కనిపిస్తారు. శుక్రవారం ఆగష్టు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉందా లేదా అనేది ఈ సమీక్షలో చూద్దాం. 

DID YOU KNOW ?
తొలిసారి హీరోగా కమెడియన్ ప్రవీణ్
కమెడియన్ గా గుర్తింపు పొందిన నటుడు ప్రవీణ్ తొలిసారి హీరోగా నటించిన చిత్రం బకాసుర రెస్టారెంట్. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
26
కథ 

పరమేశ్వర్ (ప్రవీణ్) ఇష్టం లేకపోయినప్పటికీ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. ఎప్పటికైనా తాను సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించాలనేది అతడి కల. కానీ రెస్టారెంట్ ప్రారంభించడానికి అతడికి పరిస్థితులు అనుకూలించవు. దీనితో బాగా డబ్బు సంపాదించడం కోసం తన స్నేహితుల సలహా మేరకు యూట్యూబ్ లో గోస్ట్ వీడియోలు చేయాలనుకుంటాడు. తన స్నేహితులతో కలిసి ప్రవీణ్ చేసిన తొలి గోస్ట్ వీడియో సక్సెస్ అవుతుంది. బాగా వైరల్ అవుతుంది. 

రెండవ వీడియో కోసం తన ప్రవీణ్, అతడి స్నేహితులు ఓ గోస్ట్ హౌస్ కి వెళతారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకంలో ఉన్నట్లుగా చేసి ధనవంతులు కావాలని ప్రయత్నిస్తారు. వీరు చేసే పూజలు వికటించి ఒక ఆత్మ బయటకి వస్తుంది. ఆ ఆత్మకి విపరీతమైన ఆకలి. దీనితో వారి ఫుడ్ మొత్తం తినేస్తూ ఉంటుంది. దానిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయగా ఆ ఆత్మ ప్రవీణ్ స్నేహితుల్లో ఒకరైన అంజిబాబు(ఫణి) శరీరంలోకి ప్రవేశిస్తుంది. అసలు ఆ ఆత్మ ఎవరు ? ఆ ఆత్మ వల్ల వీరికి ఎలాంటి సమస్యలు వచ్చాయి ? ఈ కథలో వైవా హర్ష పాత్ర ఏంటి ? రెస్టారెంట్ ప్రారంభించాలనే తన లక్ష్యాన్ని ప్రవీణ్ చేరుకున్నాడా ? అనేది మిగిలిన కథ. 

36
విశ్లేషణ 

తెలుగులో హారర్ కామెడీ చిత్రాలకు కొదవలేదు. తరచుగా అలాంటి చిత్రాలు వస్తూనే ఉంటాయి. సినిమాలో వైవిధ్యమైన అంశాలు ఉన్నప్పుడే ఆ చిత్రంపై ఆసక్తి పెరుగుతుంది. బకాసుర రెస్టారెంట్ చిత్రంలో దెయ్యానికి ఆకలి ఎక్కువ ఉన్నట్లుగా, తిండిబోతుగా చూపించారు. హర్రర్ కామెడీ చిత్రాల్లో దెయ్యం సన్నివేశాలు వినోదాన్ని పంచుతూనే చివరికి ఆ దెయ్యాన్ని సరైన ముగింపు ఉండాలి. ఈ చిత్రంలో అలాంటి ప్రయత్నం చేశారు. కానీ దర్శకుడు ఈ ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ కాలేదు.  

డబ్బు కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు పడే కష్టాలని కొన్ని సన్నివేశాల్లో చక్కగా వివరించారు. హీరో డబ్బు సంపాదించడం కోసం గోస్ట్ వీడియోలు మొదలు పెట్టే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి గోస్ట్ హౌస్ కి వెళ్ళినప్పుడు కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయించే విధంగా ఉంటాయి. కానీ ఆ సన్నివేశాలని దర్శకుడు ఎక్కువగా రిపీట్ చేశారు. దీనితో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు.  

ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని కామెడీ సన్నివేశాలు వర్కౌట్ అయ్యాయి. మిగిలిన కథ అంతగా అప్పీలింగ్ గా లేదు. ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ లో కథకి చాలా పొటెన్షియల్ ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ప్రీ క్లైమాక్స్ లో అల్లరి దెయ్యలతో క్రియేట్ చేసిన ఎపిసోడ్స్ సిల్లీగా అనిపిస్తాయి.  క్లైమాక్స్ సన్నివేశాలని ఎమోషనల్ గా ముగించారు. 

46
నటీనటులు

కమెడియన్ గా ప్రవీణ్ కి మంచి గుర్తింపు ఉంది. హీరోగా అతడు ఎలా రాణిస్తాడు అనేది ఆడియన్స్ కి ఐడియా లేదు. కానీ బకాసుర రెస్టారెంట్ చిత్రంలో తన పాత్రని ప్రవీణ్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అంతే కాదు కథ మొత్తాన్ని తానే ముందుండి నడిపించాడు. ఈ చిత్రానికి తాను ఏం చేయగలనో అన్నీ చేశాడు ప్రవీణ్. మిడిల్ క్లాస్ కష్టాలు వివరించే సన్నివేశంలో ప్రవీణ్ నటన చాలా బాగా ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ లుక్స్ కూడా నేచురల్ గా ఉంటాయి. 

ఇక వైవా హర్షకి స్క్రీన్ స్పేస్ తక్కువ. కనిపించినంత మేరలో బాగానే ఆకట్టుకున్నాడు. వీరి తర్వాత ఈ చిత్రంలో హైలైట్ అయింది ఫణి. తాను పోషించిన అంజిబాబు పాత్రలో ప్రవీణ్ చక్కగా ఒదిగిపోయాడు. చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన కృష్ణ భగవాన్ పర్వాలేదనిపించారు. హీరోయిన్ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. 

56
టెక్నికల్ గా

డైరెక్టర్ ఎస్ జె శివ బకాసుర రెస్టారెంట్ కథ కోసం ఎంచుకున్న పాయింట్ బావుంది. హర్రర్, కామెడీ అంశాలని బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నించాడు. కానీ కొన్ని సన్నివేశాలు ఏమాత్రం వర్కౌట్ కాలేదు. వైవా హర్ష పాత్ర ఇంకా బలంగా ఉంటే కథకి ప్లస్ అయ్యేది. స్టోరీ నెమ్మదిగా సాగడం కూడా మరో మైనస్

సినిమాటోగ్రఫీ బావుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ కి ఇంకా పని చెప్పాల్సింది. ఫస్ట్ హాఫ్ లో రిపీట్ అయిన సన్నివేశాలు, సాగదీసిన సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. వికాస్ బదిశా  అందించిన సంగీతం పర్వాలేదు.

66
ఫైనల్ గా

'బకాసుర రెస్టారెంట్' చిత్రంలోని కథ అంతగా టేస్టీగా లేదు. హారర్ కామెడీ చిత్రాలని అమితంగా ఇష్టపడే వారు మాత్రమే తక్కువ అంచనాలతో చూడొచ్చు.

రేటింగ్ : 2.5/5

Read more Photos on
click me!

Recommended Stories