అఖండ 2 పోస్ట్ పోన్ అంటూ కొన్ని రోజుల క్రితం వచ్చిన రూమర్స్ పటాపంచలు అయ్యాయి. తాజాగా అఖండ 2 చిత్ర యూనిట్ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. ఈ చిత్రానికి బాలయ్య డబ్బింగ్ పూర్తి చేశారు. రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు.
కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ విడుదల వాయిదా పడుతుందనే వార్తలు వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్–సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న OG చిత్రం సోలో రిలీజ్ కావడం ఖాయం అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం ఈ రెండు భారీ చిత్రాల బాక్సాఫీస్ యుద్ధం సెప్టెంబర్ 25న ఖాయం అయింది.
DID YOU KNOW ?
అఖండ 2లో బజరంగీ భాయిజాన్ నటి
బాలకృష్ణ అఖండ 2 చిత్రంలో హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో నటిస్తోంది. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయీజాన్ చిత్రంలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి తెలిసిందే.
25
డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య
తాజాగా బాలకృష్ణ అఖండ 2లో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో బోయపాటి శ్రీనుతో కలిసి ఉన్న ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా పోస్టులో, “గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు. వీరి కాంబినేషన్ లో 4వ బ్లాక్ బస్టర్ సిద్ధం అవుతోంది. బాలయ్య తాండవం మీ ఊహకి అందని విధంగా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్” అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ తో అఖండ 2 వాయిదా అనే రూమర్స్ పటాపంచలు అయ్యాయి. అంతే కాదు ఓజితో పోటీకి సై అంటూ బాలయ్య ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
35
త్వరలో ప్రమోషన్స్
ప్రస్తుతం CG వర్క్, రీ–రికార్డింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోపు అన్ని పనులు పూర్తయ్యి, మూడు వారాల్లో ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని సమాచారం. త్వరలోనే ప్రమోషన్స్ కూడా ప్రారంభమవుతాయి.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. బాలీవుడ్ చిత్రం ‘బజరంగీ భాయిజాన్’ ద్వారా గుర్తింపు పొందిన హర్షాలి మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నారు.రామ్ అచంట, గోపీనాథ్ అచంటలు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ భారీ సీక్వెల్‌ను నిర్మిస్తుండగా, బాలయ్య డాటర్ తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు.
55
ఓజి X అఖండ 2
ఓజి, అఖండ 2 రెండు చిత్రాలపై ఊహకందని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఎలా ఎంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు భారీ చిత్రాల బాక్సాఫీస్ క్లాష్ వల్ల నిర్మాతలు, బయ్యర్లు నష్టపోయే ప్రమాదం ఉంది. థియేటర్ల సమస్య కూడా తప్పదు. అయినప్పటికీ అటు పవన్ ఇటు బాలయ్య పోటీకి సై అంటున్నారు.