పంచ్ ప్రసాద్ పరిస్థితి దయనీయంగా మారింది, ఒక్క రూపాయి లేదు... నేనే ఆదుకుంటా, కిరాక్ ఆర్పీ డేరింగ్ డెసిషన్  

First Published Jan 12, 2023, 4:06 PM IST

పంచ్ ప్రసాద్ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య సమస్యలపై కిరాక్ ఆర్పీ స్పందించారు. ప్రసాద్ మంచి వాడు. ఎంత ఖర్చైనా అతన్ని నేను ఆదుకుంటానని తాజా ఇంటర్వ్యూలో హామీ ఇచ్చారు.

Kiraak RP


జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకడైన పంచ్ ప్రసాద్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన కిడ్నీ సంబంధించిన  వ్యాధికి గురయ్యారు. ప్రాణాల మీదకు రావడంతో తోటి కమెడియన్స్ ఆదుకున్నారు. పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కి కావలసిన ఆర్థిక సహాయం చేశారు. మాజీ జబర్దస్త్ జడ్జెస్ రోజా, నాగబాబు కూడా తమ వంతు సహాయం చేశారని సమాచారం. 
 


జబర్దస్త్ తో పాటు పలు బుల్లితెర షోస్ లో అతడు పెద్దగా కనిపించలేదు. డయాలసిస్ చేయించుకుంటున్న ఆ మధ్య ప్రసాద్ కోలుకున్నాడు. ఆరోగ్యం కుదుటపడ్డాక రీ ఎంట్రీ ఇచ్చాడు. మళ్ళీ పంచ్ ప్రసాద్ కి అనారోగ్యం తిరగబెట్టింది. అతడు అసలు నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని మిత్రుడు నూకరాజు తెలియజేశాడు. పరోక్షంగా ఆయన్ని ఆదుకోవాలని రిక్వెస్ట్ చేశాడు. 
 

కుటుంబానికి  పంచ్ ప్రసాదే ఆధారం. ఆరోగ్యం సహకరించకపోయినా అతడు షోలు చేస్తున్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు వంటి కామెడీ షోలలో పంచ్ ప్రసాద్ పాల్గొంటున్నారు. పంచ్ ప్రసాద్ ఆరోగ్యంపై కూడా కమెడియన్స్ జోకులు వేస్తారు. ఆయన కూడా తనపై తాను పంచెస్ వేసుకుంటున్నారు. సదరు షోలో చేసేవారందరూ మిత్రులు కావడంతో అతనికి సప్పోర్ట్ చేస్తున్నారు. 
 

Kirak RP

పంచ్ ప్రసాద్ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య సమస్యలపై కిరాక్ ఆర్పీ స్పందించారు. ప్రసాద్ మంచి వాడు. ఎంత ఖర్చైనా అతన్ని నేను ఆదుకుంటానని తాజా ఇంటర్వ్యూలో హామీ ఇచ్చారు. కిరాక ఆర్పీ మాట్లాడుతూ... పంచ్ ప్రసాద్ మంచి వ్యక్తి. నాకు మిత్రుడు. అతడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యానికి ఉన్న డబ్బులు మొత్తం ఖర్చై పోయాయి. 
 

ప్రస్తుతం పంచ్ ప్రసాద్ వద్ద కనీసం ఒక్క రూపాయి లేదు.ఇంటి అద్దె చెల్లించడానికి కూడా ఇబ్బందిగా ఉంది. పంచ్ ప్రసాద్ కి నేను సహాయం చేస్తాను. రూ. 15 లక్షలు ఖర్చైనా ప్రసాద్ కి కిడ్నీ ఆపరేషన్ చేయిస్తాను. 

త్వరలో మణికొండ ఏరియాలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొత్త బ్రాండ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ షాప్ ద్వారా వచ్చే లాభాల నుండి ప్రతి నెలా కొంత డబ్బులు పంచ్ ప్రసాద్ కి ఇస్తాను. అతని ఖర్చులు పోగా ఒక పదివేలు అదనంగానే ఇస్తాను... అని కిరాక్ ఆర్పీ తన గొప్ప మనసు చాటుకున్నాడు.

ఇక జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఒకరైన కిరాక్ ఆర్పీ ఇటీవల కూకట్ పల్లి ఏరియాలో చేపల పులుసు స్పెషల్ కర్రీ పాయింట్ పెట్టాడు. అది ఆయనకు భారీగా లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ క్రమంలో ఆయన చాలా బ్రాంచెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. తన సొంత ఊరు నెల్లూరొచ్చి సిబ్బందిని నియమించుకున్నాడు. వారిని హైదరాబాద్ కి తీసుకొచ్చారు. 

click me!