కమల్ హాసన్, నాగార్జున కాదు.. సౌత్ కింగ్ ఆఫ్ రొమాన్స్ ఇతనే.. మూడు పెళ్లిళ్లు, లెక్కలేని ఎఫైర్లు
Gemini Ganesan: జెమినీ గణేశన్ వర్ధంతి సందర్భంగా ఈ సౌత్ సూపర్ స్టార్, కింగ్ ఆఫ్ రొమాన్స్ పెళ్లిళ్లు, ఎఫైర్లు, రిలేషన్ షిప్ గురించి తెలుసుకుందాం.
Gemini Ganesan: జెమినీ గణేశన్ వర్ధంతి సందర్భంగా ఈ సౌత్ సూపర్ స్టార్, కింగ్ ఆఫ్ రొమాన్స్ పెళ్లిళ్లు, ఎఫైర్లు, రిలేషన్ షిప్ గురించి తెలుసుకుందాం.
Gemini Ganesan: సౌత్ సినిమాలు, రొమాన్స్ కింగ్ గా పేరుగాంచిన జెమినీ గణేశన్ 20వ వర్ధంతి ఈ శనివారం. ఆయన 2005లో చెన్నైలో చనిపోయారు. ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు, పెళ్లిళ్లు, ఎఫైర్ల గురించి తెలుసుకుందాం.
జెమినీ గణేశన్ సౌత్ తో పాటు కొన్ని హిందీ, కన్నడ, మలయాళం చిత్రాల్లో కూడా నటించారు. తెలుగులో ఒకే ఒక్క మూవీ చేశాడు. అదే చిరంజీవి `రుద్రవీణ`. నటుడిగా కెరీర్ ప్రారంభించి పాపులారిటీ సంపాదించడానికి చాలా కష్టపడ్డారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. కష్టపడి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
జెమినీ గణేశన్ తన స్నేహితురాలు అలమేలు తండ్రిని కలిశారు. అలమేలును పెళ్లి చేసుకుంటే మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని ఆయన కండీషన్ పెట్టారు. డాక్టర్ అవ్వాలనే ఆశతో 19 ఏళ్ల వయసులో జెమినీ పెళ్లి చేసుకున్నారు.
అలమేలును పెళ్లి చేసుకున్నా జెమినీ గణేశన్ కు ఉపయోగం లేకపోయింది. ఎందుకంటే మెడికల్ కాలేజీలో సీటు వచ్చేలోపే ఆయన మామగారు చనిపోయారు.
పెళ్లి తర్వాత జెమినీకి నలుగురు కూతుళ్లు - రేవతి, కమల, జయలక్ష్మి, నారాయణి పుట్టారు. వారిలో ముగ్గురు డాక్టర్లు, ఒకరు జర్నలిస్ట్. పని కోసం వెతుకుతున్న సమయంలో జెమినీ సైడ్ రోల్స్ చేయడం మొదలుపెట్టారు. 1953లో 'మనం పోల మాంగల్యం' సినిమాలో మొదటిసారి హీరోగా కనిపించారు. ఆ సినిమా హిట్ అయ్యాక ఆయన దశ తిరిగింది.
సినిమాల్లో కలిసి నటిస్తున్న సమయంలో జెమినీ గణేశన్, పుష్పావల్లికి దగ్గరయ్యారు. పెళ్లి కాకుండానే పుష్పావల్లి, జెమినీకి ఇద్దరు కూతుళ్లు - రేఖ, రాధాలకు తల్లి అయింది. జెమినీ ఎప్పుడూ పుష్పావల్లిని భార్యగా గుర్తించలేదు. ఆ తర్వాత జెమినీకి మన అమ్మాయి సావిత్రి పరిచయమైంది.
ఆమె నటి అవ్వాలనుకుంది. జెమినీ సావిత్రికి సహాయం చేశారు. కలిసి పనిచేసే సమయంలో ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. సావిత్రిని పెళ్లి చేసుకున్న తర్వాత జెమినీ రేఖ తల్లికి దూరంగా ఉన్నారు. తన కూతుళ్లను కూడా గుర్తుపట్టడానికి నిరాకరించేవారు.
సావిత్రి సూపర్ స్టార్ అయిపోయింది. తెలుగు తమిళంలో వరుస సినిమాలు చేసి స్టార్ ఇమేజ్ అందుకుంది. మహానటిగా ఎదిగింది. జెమినీ గణేషన్‌కి ఉన్న ఎఫైర్లు చూసి ఆమె బాధపడింది. ఆయనకు దూరంగా ఉంది. దర్శకురాలిగా మారింది, నిర్మాతగా మారింది. చాలా నష్టపోయింది. ఒకానొక సమయంలో ఆమె దివాళా తీసింది.
ఆ తర్వాత ఆమెకు డ్రగ్స్ అలవాటు అయ్యింది. అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లి చనిపోయింది. జెమినీ మూడో పెళ్లి జూలియానాతో జరిగింది. మూడు అధికారికంగా పెళ్లిళ్లు చేసుకుంటే, పుష్పవల్లికి అనధికారికంగా భర్త అయ్యారు. వీరు కాకుండా చాలా మందితో ఆయనకు ఎఫైర్లు ఉన్నాయి.
జెమినీ గణేశన్ తన కెరీర్ లో 200 సినిమాల్లో నటించారు. ఆయన ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు చేశారు. అందుకే ఆయన్ని సౌత్‌లో కింగ్ ఆఫ్ రొమాన్స్ గా పిలుస్తుంటారు. అప్పట్లో ఆయన సినిమాలు రిలీజ్ అయితే సూపర్ హిట్ అయ్యేది.
జెమినీ గణేశన్ కు 8 మంది పిల్లలు. ఆయనకు 7 మంది కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. బాలీవుడ్ నటి రేఖ ఆయన కూతురే. అయితే తండ్రీకూతుళ్ల సంబంధం ఎప్పుడూ బాగా లేదు. జెమినీ రేఖను ఎప్పుడూ తన కూతురిగా అంగీకరించలేదు.
రేఖ ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ - "ఆయన నన్ను ఎప్పుడూ పట్టించుకున్నట్లు అనిపించలేదు. తండ్రి అంటే ఏంటో నాకు తెలీదు. నా దృష్టిలో ఫాదర్ అంటే చర్చి ఫాదర్" అని చెప్పింది. ఇక జెమినీ, సావిత్రిలకు జన్మించిన ఛాముండేశ్వరి సావిత్రి వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఆమె చెన్నైలో ఉంటుంది. మిగిలిన వారంతా వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారు.