Killer Movie: సినిమా చూసి ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు.. కిల్లర్‌ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. కండీషన్స్ ఏంటంటే?

Published : Oct 28, 2026, 05:30 PM IST

Killer Movie: సినిమా చూసి ఇంటర్వెల్‌ టైమ్‌లో సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ ఏంటో గెస్‌ చేసి చెబితే కోటీ రూపాయలు ఇస్తామని ప్రకటించింది కిల్లర్‌ మూవీ టీమ్‌. అందుకు కండీషన్స్ ఏంటో వివరించారు.

PREV
13
కిల్లర్‌ మూవీ కోటీ రూపాయల ఆఫర్‌

`కిల్లర్‌` మూవీ హీరో, దర్శకుడు, నిర్మాత ఈ కోటీ రూపాయల ఆఫర్‌ గురించి వివరించారు. ఆయన ఏం చెప్పాడంటే. `మా సినిమాకు కోటి రూపాయల కాంటెస్ట్ అనౌన్స్ చేయగానే అది ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. సక్సెస్ మీట్ లో విజేతను ప్రకటిస్తామని చెప్పాం. అయితే కొందరు మాత్రం సోషల్ మీడియాలో మీ సినిమా సక్సెస్ అయితే కదా, ఆ కోటి రూపాయలన్నా కలెక్షన్స్ వస్తాయా అని పోస్ట్ లు చేస్తున్నారు. మా ప్రమోషనల్ కంటెంట్ ఎగ్జైట్ చేస్తే వచ్చి సినిమా చూడమని అంటున్నాం. మా సినిమాలోని ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించాం. అది ఊరికే చెప్పలేదు హైకోర్టు లాయర్ తో కొన్ని నిబంధనలతో అగ్రిమెంట్ రాయించి మరీ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. మా మూవీ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ నెల 29న 10 గంటలకు ప్రీమియర్స్ ఉంటాయి. సినిమా సెకండాఫ్ లో వచ్చే మేజర్ ట్విస్ట్ ఏదైతో ఉందో, ఆ ట్విస్ట్ అలా అవడానికి ఒక మేజర్ రీజన్ ఉంటుంది. ఇంటర్వెల్ ఇచ్చిన 5 నిమిషాల్లో జస్ట్ వన్ లైన్ ఆన్సర్ మా వాట్సాప్ నెంబర్ 7330608675 కు పంపాలి. షో చూస్తున్న టికెట్ ఫొటో పెట్టి ఆన్సర్ రాయాలి. ఆ ఐదు నిమిషాల్లో వచ్చిన మెసేజ్ లు అన్నీ ఈ మెబైల్ లో రికార్డ్ అయ్యి ఉంటాయి. మీరు పంపే సమధానం మా ఆన్సర్ తో పోలి ఉండాలి. మా జవాబు కూడా మేము డేట్ తో వీడియో రికార్డ్ చేసి పెట్టాం. సక్సెస్ మీట్ లో ఆ విజేతను ప్రకటిస్తాం. తక్కువ టైమ్ లో ఆన్సర్ పంపిన వారికి బహుమతి ఉంటుంది. మా మూవీ డీటెయిల్స్ మేము చాలా చెప్పాం. మా చిత్రంలో ఒక నావెల్టీ ఉంటుంది. అది ఇప్పటిదాకా మీరు ఏ సినిమాలో చూడలేదు. కిల్లర్ సినిమా ఒక్క చిత్రంతో ఆగిపోదు నాలుగైదు పార్ట్స్ రాబోతున్నాయి. జ్యోతి వైవిధ్యమైన పలు పాత్రల్లో సూపర్బ్ పర్ ఫార్మెన్స్ చేసింది. తను ఈ సినిమా కోసం ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. మా సినిమా సక్సెస్ అయి తీరుతుంది` అని అన్నారు.

23
ఉమెన్స్ కి సర్‌ప్రైజ్‌

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్". ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది. ఓవర్సీస్ లో `కిల్లర్` మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్ మీట్ ను బుధవారం నిర్వహించారు.

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ, `మీకు సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తారని వుమెన్ కోసం పెట్టిన ఈ కాంటెస్ట్ లో ఇన్స్ పైరింగ్ ఆన్సర్స్ పంపిన 8 మందిని సెలెక్ట్ చేశాం. వారికి ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున అందించడం సంతోషంగా ఉంది. మనలోనే సూపర్ పవర్స్ ఉన్నాయి. మన దేశాన్ని అనునిత్యం కాపాడుతున్న సైనికులను సూపర్ పవర్స్ అనుకోవచ్చు. వారికి మా టీమ్ అంతా సెల్యూట్ చేస్తోంది. కిల్లర్ లాంటి బ్రిలియంట్ సబ్జెక్ట్ ను తెరపైకి తీసుకొస్తున్న పూర్వజ్ కు కంగ్రాట్స్ చెబుతున్నా` అని చెప్పారు.

33
సెకండాఫ్‌లో ట్విస్ట్ గెస్ట్ చేస్తే కోటీ రూపాయలు

హైకోర్ట్ లాయర్ సురేష్ మాట్లాడుతూ, `ఈ సినిమాకు కోటి రూపాయల కాంటెస్ట్ గురించి పూర్వాజ్ నాతో చాలా డిస్కస్ చేశారు. మేము చర్చించుకున్న తర్వాత ఇందులో ఏ సమస్య లేదు అనే కన్ క్లూజన్ కు వచ్చాం. దర్శకుడిగా పూర్వాజ్ గారిలోని ధైర్యాన్ని, మంచితనాన్ని చూడండి. ఆయన తన సినిమా మీద నమ్మకంతో కోటి రూపాయల ఆఫర్ ప్రేక్షకులకు ఇస్తున్నారు. ఇలాంటి ఆఫర్ ఇప్పటిదాకా ఏ ఫిలింమేకర్ ఇవ్వలేదు. ఆయన ధైర్యాన్ని, నమ్మకాన్ని మనమంతా అప్రిషియేట్ చేయాలి. థియేటర్ లో సినిమా చూసి కథలోని ట్విస్ట్ ను ఊహించి చెప్పిన వారికే ఈ బహుమతి ఉంటుంది. ట్విస్ట్ ను ఊరికే ఊహించగలిగితే ఇంత పెద్ద మొత్తం బహుమతి ఇవ్వరు. మీరు సినిమా చూసేప్పుడు ఏకాగ్రతతో ఉండండి. పూర్వాజ్ ఇలాగే కాన్ఫిడెంట్ గా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా` అని చెప్పారు. ఇందులో లైన్‌ ప్రొడ్యూసర్‌ సీతారామ్‌, నటి మానస, నటుడు చంద్రకాంత్‌, గౌతమ్‌ చక్రధర్‌, మనీష్‌ గిలాడా, అయినబత్తిన దశరథ మాధవ్‌ వంటి వారు పాల్గొన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories