హీరోయిన్ ఇంద్రజ కెరీర్ ప్రారంభంలో అతి చేసిందట. దర్శకుడు సాగర్ ఆ విషయాన్ని వెల్లడించారు. ట్రైన్‌లో వస్తే తనకు వామిటింగ్ అవుతుందని తెలిపిందట. దీంతో ఆమెకి పెద్ద ఝలక్ ఇచ్చారు.
హీరోయిన్ ఇంద్రజ ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తూ రాణిస్తోంది. అదే సమయంలో స్పీడ్ కూడా పెంచింది. ఓ వైపు జబర్దస్త్ కామెడీ షోకి హోస్ట్ గా చేస్తూనే ఉంది. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఆమె ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసి నటించింది. సూపర్ స్టార్ కృష్ణ వంటివారితోనూ రొమాన్స్ చేయడం విశేషం. ఈ క్రమంలో ఆమె కెరీర్ బిగినింగ్‌లో జరిగిన ఒక సంఘటన గురించి దర్శకుడు సాగర్ ఓపెన్ అయ్యాడు. ఇంద్రజ చేసిన మిస్టేక్‌ని వెల్లడించాడు.
24
ట్రైన్‌లో వామిటింగ్ అవుద్దని చెప్పిందట ఇంద్రజ
దర్శకుడు విద్యా సాగర్ రెడ్డి(సాగర్) దర్శకత్వంలో `అమ్మదొంగ` చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించింది ఇంద్రజ. ఇందులో కృష్ణ హీరో. సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఈ మూవీతో ఇంద్రజ కూడా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత మరో సినిమా చేశారు. అందులో కృష్ణ హీరో. కేఆర్ విజయ, ప్రేమ వంటి వారు నటించారు. ఇంద్రజ కూడా ఓ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా షూటింగ్ మైసూర్‌లో అనుకున్నారు దర్శకుడు సాగర్. కేఆర్ విజయకి అప్పటికే సొంతంగా ఫ్లైట్ ఉంది. కావాలంటే అందులోనే వస్తుంది. ఆమెకి విషయం చెబితే ట్రైన్‌లోనే వస్తానని చెప్పింది. ఆమె టీమ్ కారులో వస్తారని చెప్పింది. ఆ తర్వాత ఇంద్రజని ఎలా వస్తావని అడిగితే ఫ్లైట్‌లో వస్తానని చెప్పింది. ఇలా కేఆర్ విజయ వాళ్ల టీమ్ ట్రైన్‌లోనే వస్తున్నారని చెబితే, తనకు ట్రైన్‌లో వస్తే వామిటింగ్ అవుతుందని చెప్పింది. ఫ్లైట్‌లోనే వస్తానని చెప్పింది.
34
ఇంద్రజకి చుక్కలు చూపించిన సాగర్
దీంతో అలానే వచ్చింది. వచ్చాక సెట్‌లో ఎవరూ ఆమెతో మాట్లాడొద్దు అని టీమ్‌తో చెప్పాను. డైరెక్టర్, అసిస్టెంట్, కెమెరామెన్ తప్ప ఎవరూ మాట్లాడలేదు. షూటింగ్ మొత్తం అలానే చేశాం. దీంతో ఆమెకి అర్థమయ్యింది. తాను ఏం తప్పు చేశానో తెలుసుకుంది. ఆ తర్వాత వచ్చి సారీ చెప్పింది. అప్పుడే చెప్పాను. అమ్మ ఇక్కడ ఎవరు ఎలా ఉండాలో అలానే ఉండాలి. ఎక్కువ చేయొద్దు. ఇలా చేస్తే కెరీర్ పోతుందని చెప్పి వార్నింగ్ ఇచ్చాడట దర్శకుడు సాగర్. ఆ తర్వాత తాను తగ్గిందని చెప్పాడు. అయితే ఆ తర్వాత ఆమెతో పనిచేయలేదని వెల్లడించారు. కానీ ఇంద్రజ ఇతర సినిమాలు చేసి మెప్పించింది.
ఆ తర్వాత ఇంద్రజ `పిట్టల దొర`, `ఒక చిన్నమాట`, `చిలక్కొట్టుడు`, `పెద్దన్నయ్య`, `చిన్నబ్బాయి`, `చిన్న చిన్న ఆశ`, `సమ్మక్క సారక్క` వంటి చిత్రాలు చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకొని రాణించింది. భారీగా సినిమాలు చేసి మెప్పించింది. ఇటీవల `చకోర` చిత్రంలో మెరిసింది. హీరోకి తల్లిగా నటించింది.