Richest Singers : ఏఆర్ రెహమాన్ నుంచి హనీ సింగ్ వరకు.. ఇండియాలో అత్యంత ధనిక సింగర్స్ వీళ్లే

Published : Oct 28, 2026, 05:09 PM IST

Richest Singers : ఇండియాలో తమ గాత్రంతో మ్యాజిక్ చేసే సింగర్స్ చాలా మందే ఉన్నారు. కానీ 2026 నాటికి మన దేశంలో అత్యంత సంపన్న గాయకులు ఎవరో మీకు తెలుసా? రిచ్చెస్ట్ సింగర్స్ ఎవరంటే?

PREV
16
ఇండియా రిచ్చెస్ట్ సింగర్స్

బాలీవుడ్‌లో చాలా మంది సింగర్స్‌కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సింగర్స్ కూడా భారీగా పారితోషికాలు తీసుకుంటున్నారు. ఒక్కోపాటకి లక్షల్లో అందుకుంటున్నారు. అదే సమయంలో మ్యూజిక్‌ కాంసర్ట్ ద్వారా భారీగానే సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో మరి అత్యంత ధనిక సింగర్స్ ఎవరో మీకు తెలుసా? ఏఆర్ రెహమాన్ నుంచి అరిజిత్ సింగ్, హనీ సింగ్ వరకు.. ఈ ఐదుగురు సింగర్స్ వందల కోట్ల ఆస్తులకు అధిపతులు. 2026 నాటికి ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ సింగర్స్ ఎవరో, వాళ్ల నెట్ వర్త్ ఎంతో తెలుసుకుందాం.

26
ఇండియా రిచ్చెస్ట్ నెంబర్‌ 1 సింగర్‌ ఏఆర్‌ రెహమాన్‌

ఇండియన్స్ అందరికీ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్లలో ఏఆర్ రెహమాన్ ఒకరు. 2026 నాటికి ఇండియాలో అత్యంత ధనిక సింగర్స్ లిస్ట్‌లో రెహమాన్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.1,813 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఆయన `రామాయణం`కి మ్యూజిక్‌ అందిస్తున్నారు.

36
నెంబర్‌ 2 అర్జిత్ సింగ్‌

మ్యూజిక్ లవర్స్ గుండెల్లో అర్జిత్‌ సింగ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇండియాలో బెస్ట్ సింగర్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఆయనదే. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.414 కోట్లు అని టాక్. రెండు గంటల మ్యూజిక్ కాన్సర్ట్ కోసం అరిజిత్ ఏకంగా రూ.14 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఆయన నెలకు సగటున రూ.6 కోట్లు సంపాదిస్తారని సమాచారం.

46
నెంబర్‌ 3 సోనూ నిగమ్‌

హర్యానాలోని ఫరీదాబాద్‌లో పుట్టిన సోనూ నిగమ్, నాలుగేళ్ల వయసులోనే తన తండ్రితో కలిసి స్టేజ్ మీద పాడటం మొదలుపెట్టారు. సంపద విషయంలో సోనూ నిగమ్ మూడో స్థానంలో ఉన్నారు. 2026 నాటికి ఆయన ఆస్తి విలువ రూ.370 నుంచి రూ.400 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. సోనూ నిగమ్ ఒక్కో పాటకు రూ.15 నుంచి రూ.18 లక్షల వరకు పారితోషికం తీసుకుంటారు.

56
నెంబర్‌ 4 హనీ సింగ్‌

ఇండియాలో డిఫరెంట్ స్టైల్ సాంగ్స్, ర్యాప్ మ్యూజిక్ ట్రెండ్ క్రియేట్ చేసిన సింగర్స్‌లో హనీ సింగ్ ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు కోట్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. రిచెస్ట్ సింగర్స్ లిస్ట్‌లో హనీ సింగ్ కూడా ఉన్నారు. ఆయన ఆస్తి విలువ రూ.246 కోట్లు. మ్యూజిక్ కాన్సర్ట్స్ కోసం ఆయన రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు తీసుకుంటారు. బ్రాండ్ ప్రమోషన్స్ కోసం కోటి రూపాయలకు పైగానే ఛార్జ్ చేస్తారని టాక్.

66
నెంబర్‌ 5 తులసి కుమార్‌

రిచెస్ట్ సింగర్స్ లిస్ట్‌లో తులసి కుమార్ ఐదో స్థానంలో ఉన్నారు. 2010లో వచ్చిన 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' సినిమాలోని 'తుమ్ జో ఆయే జిందగీ మే' పాటతో ఆమె పాపులర్ అయ్యారు. ఈరోజు ఇండియాలో అత్యంత ధనిక మహిళా సింగర్స్‌లో ఆమె ఒకరు. రిపోర్ట్స్ ప్రకారం తులసి కుమార్ ఆస్తి విలువ రూ.210 కోట్లు. ఒక్కో పాట పాడేందుకు ఆమె రూ.7 నుంచి రూ.10 లక్షల వరకు తీసుకుంటారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories