kichcha Sudeep: నటుడు కిచ్చా సుదీప్ తన మేనల్లుడు సంచిత్ 'మ్యాంగో పచ్చా' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా నెపోటిజంపై విలేకరి అడిగిన ప్రశ్నకు సుదీప్ ఘాటుగా స్పందించారు.
సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అనే మాట చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఇంట్లో అమ్మానాన్నలు నటులైతే పిల్లలకు సులువుగా అవకాశాలు వస్తాయని, ఇతరులు ఎదగడం కష్టమనే వాదన ఉంది. ఇది టాలీవుడ్‌లో ఉంది, బాలీవుడ్‌లో ఉంది, కోలీవుడ్ ఉంది. కన్నడలోనూ కొనసాగుతుంది. తాజాగా ఇదే ప్రశ్న `ఈగ` ఫేమ్ కిచ్చా సుదీప్‌కు ఎదురవగా, ఆయన కాస్త ఘాటుగానే బదులిచ్చారు.
25
మేనళ్లుడు సంచిత్ హీరోగా `మ్యాంగో పచ్చా` మూవీ
సుదీప్ అక్క కొడుకు సంచిత్ 'మ్యాంగో పచ్చా' సినిమాతో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఒక విలేకరి సుదీప్‌ను నెపోటిజం గురించి ప్రశ్నించారు. ఇది సహజంగానే సుదీప్‌కు కోపం తెప్పించింది.
35
ఈ ప్రశ్న శివరాజ్ కుమార్‌ని ఎందుకు అడగరు ?
"ఈ ప్రశ్న నన్నే ఎందుకు అడుగుతారు? ఇదే ప్రశ్నను శివరాజ్‌కుమార్‌ను అడుగుతారా?" అని సుదీప్ ఎదురు ప్రశ్నించారు. "నెపోటిజం రాజ్‌కుమార్ కాలం నుంచే మొదలైంది కదా. మరి వాళ్లను ఎందుకు అడగరు? రాజ్‌కుమార్ పిల్లలను, అంబానీని కూడా అడగాలి. మీరెందుకు అలా చేయరు?" అని ప్రశ్నించారు. `బాంబేలో పుట్టిన 'నెపోటిజం' అనే పదాన్ని ఇక్కడ వాడటం తప్పు. అణ్ణావ్ర(రాజ్ కుమార్) కాలం నుంచే ఇది ఉంది. ఎవరి పిల్లలకు కళ అబ్బుతుందో, ఎవరిని ప్రజలు చూడటానికి ఇష్టపడతారో వాళ్లే ఇండస్ట్రీకి వస్తారు. కన్నడ ప్రజలు ఇష్టపడితే చాలు. ఇది ఎవరి స్థానమైనా కావచ్చు` అని సుదీప్ తన మాటకు స్పష్టత ఇచ్చారు.
"ఈ రోజు శివన్న (శివరాజ్‌కుమార్) ఒక గొప్ప నటుడిగా ఎదిగారు. మేము ఆయన నుంచి స్ఫూర్తి పొంది పెరిగాం. అప్పు (పునీత్ రాజ్‌కుమార్) ఎంత అద్భుతమైన ప్రతిభావంతుడో అందరికీ తెలుసు. వీటికి నెపోటిజం అనే మాట రాకూడదు. వాళ్ల నుంచి స్ఫూర్తి పొందిన వాళ్లు చాలా మంది ఉన్నారు` అని సుదీప్ అన్నారు.
55
నెపోటిజం మాకు సెట్ కాదు
`మా ఇంటి నుంచి సంచిత్ వచ్చాడు. వాడు తప్ప నా కజిన్స్ పిల్లలు, అక్క పిల్లలు చాలా మంది ఉన్నారు. ఎవరూ సినిమాల్లోకి రాలేదు. నా కూతురు బాగా పాడుతుంది, అందుకే వచ్చింది. సంచిత్‌కు నటనపై ఆసక్తి ఉంది, అందుకే వచ్చాడు. 'నెపోటిజం' అనే పదం చాలా ఏళ్లుగా మాకు సూట్ కాదు. కొందరికి ఆ పదానికి అర్థం కూడా తెలియదు. తెలిసింది కళ మాత్రమే" అని కిచ్చా సుదీప్ సూటిగా సమాధానమిచ్చారు.