Vikrant Rona Review: విక్రాంత్ రోణ ట్విట్టర్ రివ్యూ, కిచ్చా సుధీప్ ఈసారి గట్టిగానే కొట్టాడు, కానీ...?

First Published | Jul 28, 2022, 6:04 AM IST

కన్నడ స్టార్ హీరో సుధీప్  తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. కన్నడ నాట హీరోగా స్టార్ డమ్ ఉన్న సుధీప్.. టాలీవుడ్ లో ఈగ సినిమాతో విలన్ గా మార్చాడు రాజమౌళి. ఆతరువాత సైరా, బాహుబలి లాంటి  సినిమాలతో... అప్పటి నుంచి టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా అలరిస్తున్నాడు సుధీప్. తాజాగా విక్రాంత్ రోణ సినిమాతో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించాడు కిచ్చ.

ఇక తరువాత తరువాత తను హీరోగా నటించిన కన్నడ సినిమాలను కూడా టాలీవుడ్ లో తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు సుధీప్. ఇక ఈ మధ్య పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో.. సుధీప్ కూడా తన సినిమాలను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తూ వస్తేన్నాడు. ఈ క్రమంలో వచ్చిందే విక్రాంత్ రోణ మూవీ. ఈరోజు (28 జులై) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.  
 

 అనూప్ బండారి దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ మూమీ  రిలీజ్ కు భారీగా సన్నాహాలు చేశారు. ప్రమోషన్ ఈవెంట్స్ కూడా భారీగా చేశారు. ఇక విక్రాంత్ రోణ యూఎస్ లో ముందుగానే రిలీజ్ అయ్యింది. ఇక ఈసినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మరి ఈ సినిమా గురించి వారు ఏమంటున్నారో చూడ్డాం.   

Latest Videos


ఈ సారి సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా భాగా స్పందించారు. విక్రాంత్ రోణ సినిమాను ట్విట్టర్ లో ఆకాశానికి ఎత్తారు. సౌత్ నుంచి మరో అద్భుతమైన సినిమా వచ్చింది, ఎందుకు ఇలా సౌంత్ ఇండస్ట్రీ  సినిమాలతో అద్బుతాలు సృస్టిస్టోంది అంటున్నారు. ముఖ్యంగా విక్రాంత్ రోణ మ్యూజిక్, బ్రాగ్రౌండ్ స్కోర్ కు ఫిదా అవుతున్నారు ఆడియన్స్. 

కిచ్చ సుధీప్ పెర్ఫామెన్స్  అద్భుతమంటూ ఎక్కువమంది ఆడియన్స్ ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతున్నారు. ఇక జర్మనీ లో  సినిమా చూసిన ఆడియన్స్ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది. పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు సుధీప్, కాకపోతే ఇంట్రవెల్ బ్యాంగ్ అంత ఆకట్టుకోలేదు అంటున్నారు. అది ఆడియన్స్ ఊహించగలిగిందే ఇచ్చారంటున్నారు. అంతే కాదు సెకండ్ హాఫ్ మూవీ ఊహించని విధంగా ఉంటుందంటున్నారు ట్విట్టర్ జనాలు. 

ఇక విక్రమ్ రోణాలో హైలెట్ విజ్యూవల్ ఎఫెక్ట్స్, అనూపు బండారి డైరెక్షన్ తో పాటు ఆర్డ్ డైరెక్టర్ శిబు టాలెంట్  ఈసినిమా సెట్టింగ్స్ లో కనిపిస్తుంది. సినిమాకు విఎఫ్ ఎక్స్ అద్భుతంగా ఉన్నాయంటున్నారు ఆడియన్స్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ కు ఫిదా అవుతున్నారు. సుధీప్ లో కొత్త కోణాన్ని చూశామంటున్నారు. 

ఈ సినిమా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ అంటున్నారు ట్విట్టర్ ఆడియన్స్. అంతే కాదు క్లైమాస్ అద్భుతంగా ఉంది అంటున్నారు. 3డి ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయట. ఈ సినిమా పాన్ ఇండియా కు తగిన సినిమాఅంటున్నారు. 

ఇక హీరోయిన్ నీతా అశోక్ తో పాటు ఈ సినిమాలో జాక్వెలిన్ చేసిన పాటకుఅద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఓవర్ ఆల్ గా సినిమాకు ట్విట్టర్ లో పాజిటీవ్ రివ్యూస్ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్ గురించి కాస్త నెగెటీవ్ కామెంట్స వినిపిస్తున్నాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ ఊహించే విధంగా ఉంది అంటున్నారు, పెద్దగా సస్పెన్స్ లేదంటున్నారు ఆడియన్స్. 
 

click me!