కన్నడ పరిశ్రమకు చెందిన కెజిఎఫ్ ఆ పరిశ్రమకు చెందిన స్టార్స్ కి ప్రేరణగా నిలిచింది. ఈ క్రమంలో కిచ్చా సుదీప్ తన ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా విక్రాంత్ రోణ విడుదల చేశారు. అన్ని పరిశ్రమల్లో నటించిన సుదీప్ కి మంచి గుర్తింపు ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆయన భిన్నమైన పాత్రలు చేశారు. ఇక విక్రాంత్ రోణ(Vikrant Rona Review) ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేయగా మూవీ ప్రేక్షకుల అంచనాలు అందుకుందో లేదో చూద్దాం...