'స్పిరిట్' : ప్రభాస్ సరసన మహేష్ హీరోయిన్

First Published | Nov 8, 2024, 10:38 AM IST

ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమాలో హీరోయిన్ ఎంపికపై చర్చ జరుగుతోంది. రష్మిక లేదా కియారా అడ్వాణీలలో ఒకరు హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Sandeep Vanga, Spirit Movie, Prabhas


రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సినిమా చేయాలని ప్రతీ హీరోయిన్ కు ఉంటుంది. అయితే అవకాసం ఏ కొద్ది మందికో వస్తుంది. వరస పెట్టి సినిమాలు చేస్తున్న ప్రబాస్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. డైనమిక్ గా డాషింగ్ గా ఉండే హీరోయిన్ కావాలని వెతుకుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన తో ఆల్రెడీ పనిచేసిన హీరోయిన్స్  అయితే బెస్ట్ అనే డెసిషన్ కు వచ్చారని తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరు...

Sandeep Vanga, Spirit Movie, Prabhas


బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు స్పిరిట్ కోసం రష్మిక , కియారా అద్వానిలను అనుకుంటున్నారట. వీళ్లిద్దరిలో ఒకరని ఫైనల్ చేస్తారట. రష్మిక ఫుల్ బిజీగా ఉందని, కియారానే ఫైనల్ అయ్యే ఛాన్స్ లు ఉన్నట్లు తెలుస్తోంది.

దానికి తోడు ఇద్దరికీ తెలుగు మార్కెట్ కూడా ఉండటం ప్లస్ కాబోతోంది. అలాగే ఇద్దరు కూడా మహేష్ ప్రక్కన సినిమాలు చేసినవారే కావటం విశేషం.  కియారాకు ఇక్కడా మంచి అభిమానులు ఉన్నారు.  ప్రభాస్ తో చేస్తే వాళ్లు నాలుగైదు రెట్లు అవుతారు. 


Sandeep Vanga, Spirit Movie, Prabhas


‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు అభిమానులకు దగ్గరైంది బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కియారా అడ్వాణీ.

2014లో ‘ఫగ్లీ’ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె తన నటనకు మంచి ప్రశంసల్ని అందుకుటోంది. ఈ ఏడాది విడుదలైన ‘సత్యప్రేమ్‌ కీ కథా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ నటి. 

Sandeep Vanga, Spirit Movie, Prabhas


కియారా మాట్లాడుతూ...మొదట్లో కథను ఎంచుకునే విషయంలో చాలా కష్టం అనిపించేంది. ఇప్పటికి కూడా(నవ్వుతూ). దాని ద్వారా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాను. ఏది చేసిన కొంచెం భిన్నంగా చేయాలనే ఆలోచనతో నాకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటాను.

‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘కబీర్‌ సింగ్‌’ సినిమాల్లోని పాత్రలకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈ పాత్రల ఎంపిక ద్వారా నా ఆలోచనల విధానం ఎలా ఉందని తెలిసింది. ఈ పాత్రలు నాకు చాలా సంతృప్తినిచ్చాయి అంటోంది.

Sandeep Vanga, Spirit Movie, Prabhas


అలాగే మొదటి నుంచి సినిమాల పట్ల నేను తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు కథలకు బదులు పది స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్నాను అంతే. సినిమాలు చేయడం ఒక పెద్ద కమిట్‌మెంట్‌. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాను.

ఉత్తేజకరమైన కథా కాదా అనేది ముందే చూసుకుంటాను. తెర వెనక ఎంతో మంది పెట్టుబడి, కష్టం, కృషి ఉంటుంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చిత్రాలు చేయాలి. ఆ సినిమా ఎలా ఉన్నా, ఏం జరిగిన జీవితంలో ఎదురైన ఒక అనుభవంలాగే ఫీల్‌ అవుతాను అని చెప్పుకొచ్చింది.

spirit Telugu movie


ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించనున్న చిత్రం ‘స్పిరిట్‌’ (Spirit). పోలీస్‌ డ్రామాగా ఇది రానుంది. ఇటీవలే దీని మ్యూజిక్ సిటింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత భూషణ్‌కుమార్‌ ‘భూల్‌ భూలయ్యా 3’ ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో ‘స్పిరిట్‌’ షూటింగ్ గురించి మాట్లాడారు. 


‘మేము ప్రస్తుతం ‘స్పిరిట్‌’ పనుల్లో బిజీగా ఉన్నాం. అందులోని నటీనటుల ఎంపిక ఇంకా ఖారారు కాలేదు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తాం. దీని తర్వాత షూటింగ్‌ పనులు మొదలుపెడతాం. డిసెంబర్‌ చివరిలో చిత్రీకరణ మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్‌ ఉంటుంది. వెంటనే సందీప్ వంగా ‘యానిమల్‌ పార్క్‌’ను మొదలుపెడతారు’ అని చెప్పారు.

దీంతో త్వరలోనే ‘స్పిరిట్’ అప్‌డేట్‌లు వరుసగా వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా దీపావళి రోజు ఈ సినిమా మ్యూజిక్‌ పనులు మొదలయ్యాయని చిత్రబృందం తెలిపింది. ఈమేరకు చిత్ర సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. హర్షవర్ధన్‌, సందీప్‌ ట్యూన్స్‌ ఎంజాయ్‌ చేస్తూ కనిపించిన ఆ ఫొటో సోషల్‌ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. 

Latest Videos

click me!