రామ్‌చరణ్‌- శంకర్‌ సినిమాకి కియారా అద్వానీకి ఎంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారో తెలుసా? మామూలుగా లేదుగా!

Published : Aug 08, 2021, 09:17 PM IST

కియారా అద్వానీ బాలీవుడ్‌లో జోరుమీదుంది. ఆమె క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ జోరుని సౌత్‌లో చూపించబోతుంది. మరోసారి ఆమె సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. రామ్‌చరణ్‌-శంకర్‌ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.   

PREV
16
రామ్‌చరణ్‌- శంకర్‌ సినిమాకి కియారా అద్వానీకి ఎంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారో తెలుసా? మామూలుగా లేదుగా!

రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో `ఆర్‌సీ15`పేరుతో పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతుంది. శంకర్‌ సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దాని రేంజే వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 
 

26

ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా కాస్టింగ్‌ అండ్‌ క్రూ ఎంపిక జరుగుతుంది. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానిని ఎంపిక చేశారు. 
 

36

ఇప్పటికే కియారా తెలుగులో మహేష్‌తో `భరత్‌ అనే నేను`, రామ్‌చరణ్‌తో `వినయ విధేయ రామ` చిత్రంలో నటించింది. మరోసారి చరణ్‌తో రొమాన్స్ చేయబోతుందీ యంగ్‌ బ్యూటీ. దీంతో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. 

46

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి కియారా తీసుకోబోతున్న రెమ్యూనరేషన్‌ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ పాన్‌ ఇండియా చిత్రానికిగానూ కియారాకి ఏకంగా నాలుగు కోట్లు ఇస్తున్నారని టాక్‌. తెలుగులో సమంత, పూజాహెగ్డేలకు, సౌత్‌ ఎంట్రీ ఇచ్చిన అలియా భట్‌కి మాత్రమే ఈ స్థాయి పారితోషికం అందిస్తున్నారు. అలాగే సౌత్‌లో నయనతార ఇంతటి రెమ్యూనరేషన్‌ అందుకుంటోంది. వారి సరసన ఇప్పుడు కియారా చేరిందని చెప్పొచ్చు. అయితే మొదట కియారా ఐదు కోట్లు డిమాండ్‌ చేసిందట. చివరికి నాలుగు కోట్లకి ఒప్పించారనే వార్త వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. 

56

ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్‌ సినిమా `షేర్షా` ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ఫోటో షూట్‌కి పోజులిచ్చింది కియారా. ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

66

అయితే ఈ ప్రమోషన్‌లో పాల్గొన్న కియారా నల్ల రంగు బ్రాలెట్‌, స్కర్ట్‌లో మెరిశారు. ఆ డ్రెస్‌ ధర హాట్‌ టాపిక్‌గా మారింది. దీనికి ఏకంగా రూ.79.500 ఖర్చు చేశారట. స్పెషల్‌గా దీన్నిడిజైన్‌ చేసినట్టు సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories