విజయ్ దేవరకొండ పై సీక్రెట్ క్రష్.. పెళ్లయ్యాక బయటపెట్టిన టాక్సిక్ బ్యూటీ ఎవరో తెలుసా?

Published : Mar 31, 2026, 04:02 PM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్ సెలబ్రిటీలలో కూడా అభిమానులు ఉన్నారు. ఎంతో మంది హీరోయిన్లకు రౌడీ హీరో క్రష్ గా మారాడు. రీసెంట్ గా ఓ హీరోయిన్ విజయ్ దేవరకొండ అంటే క్రష్ ఉండేదని అసలు విషయం బయటపెట్టింది. ఇంతకీ ఎవరామె.

PREV
15
అన్ని భాషల్లో విజయ్ కి అభిమానులు..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు తెలుగుతో పాటు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే విజయ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను ప్రేమించి పెళ్లాడాడు. సౌత్ ఇండియా స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకుని హనీమూన్‌ కూడా కంప్లీట్ చేసుకుని.. వారి సినిమాల్లో వారు ఫుల్లుగా బిజీ అయిపోయారు. ఈక్రమంలో విజయ్ పై బాలీవుడ్ హీరోయిన్ తన క్రష్ ను బయటపెట్టిన విషయం వైరల్ అవుతోంది.

25
విజయ్ దేవరకొండపై క్రష్..

తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమాను.. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటించింది. అయితే కియారా అద్వానీకి విజయ్ దేవరకొండపై సీరియస్‌గా క్రష్ ఉండేదని ఓ చిట్‌చాట్‌లో ఓపెన్‌గా ఒప్పుకుంది. కియారా అద్వానీకి ఒకప్పుడు విజయ్ దేవరకొండపై క్రష్ ఉండేదని రానా దగ్గుబాటి హోస్ట్ చేసిన ఓ షోలో బయటపెట్టింది.

35
రానా షోలో అసలు విషయం చెప్పేసిన కియారా

రానా దగ్గుబాటి హోస్ట్ చేసిన ఓ క్యాజువల్ చిట్‌చాట్‌లో కియారా ఈ విషయం బయటపెట్టింది. విజయ్ దేవరకొండపై తనకు సాఫ్ట్ కార్నర్ ఉండేదని ఓపెన్‌గా చెప్పింది. "నేను అతనికి పెద్ద అభిమానిని. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం" అని తన క్రష్ గురించి మాట్లాడింది. ఈ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. 'గేమ్ ఛేంజర్' సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నప్పుడు కూడా కియారా అప్పుడప్పుడు విజయ్ గురించి అడిగేదని సమాచారం.

45
విజయ్ తో కలిసి పనిచేసిన హీరోయిన్..

ఇక విజయ్ దేవరకొండ గురించి మాటలు కొనసాగుతుండగా, కియారా సరదాగా 'నన్ను విజయ్‌కి పరిచయం చేయొచ్చు కదా' అని రానాని అడిగింది. దాంతో అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వేశారు. నిజానికి, విజయ్, కియారా గతంలో కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో కలిసి పనిచేశారు. మొత్తానికి ఈ చిట్‌చాట్ వీడియో అభిమానులను.. సాధారణ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్' సినిమాలో కియారా నటిస్తోంది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీగా ఉంది.

55
కియారా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?

ప్రస్తుతం కియారా, యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్' సినిమాలో నటిస్తోంది ఈసినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమూవీని జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. నిజానికి ఈ సినిమాను మార్చి 19న, 'ధురంధర్-2' రిలీజ్ రోజే విడుదల చేయాలనుకున్నారు. కానీ, యుద్ధ వాతావరణం కారణంగా సినిమా రిలీజ్‌ను జూన్ 04కి వాయిదా వేశారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్ తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి స్టార్లు నటిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories