ఓ బ్లాక్‌బస్టర్ హిట్ట్ సినిమాలో నటించడం తన కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పు అని నయనతార ఓ ఇంటర్వ్యూలో చెప్పి షాకిచ్చారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో, ఆమె ఎందుకలా అన్నారో తెలుసా?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చి వెళ్లినా, నయనతార మాత్రం ప్రత్యేకంగా నిలిచారు. 'అయ్యా' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, మొదట్లో 'చంద్రముఖి' లాంటి పెద్ద సినిమాల్లో నటించారు. కానీ స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయన్ మొదటి స్థానంలో ఉంది. రజినీకాంత్, చిరంజీవి, ప్రభాస్, నాగార్జున, బాలయ్య, ఎన్టీఆర్, విజయ్, అజిత్, విక్రమ్, సూర్య వంటి స్టార్ హీరోలతో నటించిన ఆమె, ఇప్పుడు లేడి ఓరియోంటెడ్ కథలను ఎంచుకుంటున్నారు.
25
నయనతార కెరీర్ లో టర్నింగ్ పాయింట్..
నయనతార కెరీర్‌లో 'గజినీ' సినిమా ఒకరకంగా టర్నింగ్ పాయింట్. కానీ అది మంచి కోసం కాదు. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య, అసిన్ జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయింది. కానీ, 'అసలు ఈ సినిమాలో ఎందుకు నటించానా' అని నయనతార ఫీల్ అయ్యేలా చేసింది కూడా ఈ గజినీనే. కొన్ని సంవత్సరాల క్రితం ఓ రేడియో ఇంటర్వ్యూలో నయన్ ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పారు.
35
గజినీ సినిమా వల్ల నిరాశ
ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేసిన 'గజినీ'లో నటించడం తన కెరీర్‌లో తీసుకున్న తప్పుడు నిర్ణయమని నయన్ అన్నారు. ఆ సినిమాలో 'చిత్ర' అనే పాత్రలో ఆమె నటించారు. అసిన్ పోషించిన 'కల్పన' పాత్రకు సమానమైన ఇంపార్టెన్స్ తన పాత్రకు కూడా ఉంటుందని ఆమె ఆశించారు. కానీ సినిమా విడుదలయ్యాక, ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైనట్లు నయన్ చెప్పారు. ఈ అనుభవమే, ఆ తర్వాత కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాలని తనకు నేర్పిందని నయనతార తెలిపారు.
ఆ తర్వాత నయనతార విజయ్, అజిత్, సూర్య, ధనుష్, శింబు వంటి తమిళ స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. రెండు ప్రేమ వైఫల్యాలు ఆమె కెరీర్‌కు అడ్డంకిగా మారాయి. ఒకానొక దశలో ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న నయన్, అతని కోసం సినిమాను వదిలేయాలని కూడా అనుకున్నారు. కానీ కొన్ని విభేదాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఆ సమయంలో నయనతార సినీ కెరీర్ ముగిసిపోయిందని చాలామంది విమర్శించారు.
55
40 ఏళ్లు దాటినా.. తగ్గని క్రేజ్..
ఆ విమర్శలకు సమాధానంగా, నయనతార మళ్లీ సినిమాల్లోకి వచ్చి వరుస హిట్లు కొట్టారు. అందుకే తమిళ ప్రేక్షకులు ఆమెకు 'లేడీ సూపర్‌స్టార్' అనే బిరుదు ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమె కొత్త అధ్యాయం ప్రారంభించారు. 'నానుమ్ రౌడీ దాన్' సినిమా సమయంలో దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడ్డారు.
వీరి ప్రేమ పెళ్లికి దారితీసింది. ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉన్న నయన్, ప్రస్తుతం 'మన్నంగట్టి', యశ్ నటిస్తున్న 'టాక్సిక్', ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. 40 ఏళ్లు దాటినా.. అదే క్రేజ్ తో దూసుకుపోతోంది సీనియర్ తార.