పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ, నెల ముందుగానే బిడ్డను కన్న స్టార్ హీరోయిన్

Published : Jul 16, 2025, 08:18 AM IST

బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర తల్లీ తండ్రులు అయ్యారు. స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కియారా నెలలను నిండకముందే ప్రసవించినట్టు తెలుస్తోంది. 

PREV
15
తల్లీ తండ్రులైన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర

బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర తల్లిదండ్రులయ్యారు. కియారాకు మంగళవారం రాత్రి పురిటినొప్పులు రాగా ఆమెను ముంబైలోని గిర్‌గావ్ ప్రాంతంలో ఉన్న హెచ్. ఎన్. రిలయన్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడే కియారా అద్వానీ ప్రసవం జరిగింది. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. దాంతో ఇరు కుటుంబాలలో పండగ వాతావరణం నెలకొంది. ఇక ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

25
ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ

స్టార్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర తల్లీ తండ్రులు అయ్యారన్న శుభవార్త తెలియడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కియారా అద్వానీ ప్రసవం నెల రోజులు ముందే అయినట్టు సమాచారం. కియారా డెలివరీకి అగస్ట్ లో అవుతుందని డాక్టర్లు చెప్పారట. కాని నెల రోజులు ముందుగానే ఆమెకు నొప్పులు వచ్చినట్టు తెలుస్తోంది.

35
గత ఏడాది కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర పెళ్లి

బాలీవుడ్ లో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర కు అందమైన జంటగా పేరుంది. దాదాపు మూడేళ్లు సీక్రేట్ గా ప్రేమించుకున్న ఈ జంట ఎప్పుడు తమ ప్రేమ గురించి బహిరంగంగా మాట్లాడలేదు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. ఎంత మంది ప్రశ్నించినా.. కామ్ తామ పనితాము చేసుకుంటూ వెళ్లారు. ఇక గతేడాది ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న కియారా, సిద్ధార్థ్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు.

45
సరిగ్గా ఏడాదికి శుభవార్త

పసిపిల్లల సాక్స్‌ పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ, "మా జీవితంలోకి వస్తున్న అమూల్యమైన బహుమతి.. త్వరలోనే" అని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అసలు విషయాన్ని వారు వెల్లడించారు. అయితే గత నెల కియారా అద్వానీ డెలివరీ జరిగిందంటూ.. ఏఐ ఫేక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆతరువాత అందులో నిజం లేదని తెలిసింది. ఇక తాజాగా కియారా అద్వీనీ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

55
మెట్ గాలాలో సందడి చేసిన కియారా అద్వానీ

రీసెంట్ గా న్యూయార్క్‌లో జరిగిన 'మెట్ గాలా 2025' ఫ్యాషన్ ఈవెంట్‌లో కూడా కియారా అద్వానీ బేబీ బంప్‌తో కనిపించి అందరి దృష్టిని ఆకర్శించారు. మెట్ గాలాలో కియారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతే కాదు ఈ ఈ వెంట్ లో ఆమె ధరించిన డ్రెస్ ప్రత్యేకంగా నిలిచింది. గౌరవ్ గుప్తా డిజైనర్ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది. ఆ ఫొటోలను సిద్ధార్థ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే, కియారా త్వరలో 'వార్ 2' సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. ఈ ఏడాది కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories