Ennenno Janmala Bandam: చిత్ర, వసంత్ కు మధ్యలో నిధి.. వేదపై పగ తీర్చుకుంటున్న యష్!

Published : May 06, 2022, 12:20 PM IST

Ennenno Janmala Bandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandam) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు మే 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Ennenno Janmala Bandam: చిత్ర, వసంత్ కు మధ్యలో నిధి.. వేదపై పగ తీర్చుకుంటున్న యష్!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సులోచన (Sulochana) ఇంటికి చెప్పకుండా నిధి లోపలికి వచ్చి తెగ హడావిడి చేస్తోంది. దాంతో సులోచన ఫ్యామిలీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక మై నేమ్ ఇస్ నిధి సిస్టర్ ఆఫ్ దామోదర్ అని చెబుతోంది. ఈలోపు అక్కడకు యష్ (Yash) వచ్చి హార్ట్లీ వెల్కమ్ అని చెబుతాడు.
 

26

ఆ తర్వాత నిధి (Nidhi) సులోచన దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళిద్దరి దంపతులను మందలిస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక సులోచన దంపతులు ఇది నీ ఇల్లే అనుకొని హ్యాపీ గా ఉండమని నిధి తో అంటారు. ఇక నిధి వాళ్ళ అన్న దామోదర్ (Damodhar) గురించి ప్రౌడ్ గా చెబుతూ ఉంటుంది.
 

 

36

ఇక నిధి (Nidhi) ను చూసిన చిత్ర వసంత్ పై కారాలు మిరియాలు నూరుతుంది. ఇక ఇంటికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ మీరే అంటూ నిధి సులోచన ను పొగుడుతుంది. ఇక వేద అది చూడలేక నిధి ను గదిలోకి తీసుకు వెళుతూ ఉండగా యష్ (Yash) ఈలోపు నిధి ను తన ఫ్యామిలీ దగ్గరికి తీసుకుని వెళతాడు.
 

46

ఇక యష్ (Yash) ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని వేదతో అంటాడు. ఆ తరువాత నిధి (Nidhi) ఖుషికి ఒక డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇస్తుంది. ఇక యష్ తో మీ భార్య ఒక ఏంజెల్ లా ఉంది అని అంటుంది. దాంతో వేద కూడా కొంత ఆనంద పడుతుంది. అంతేకాకుండా మీ ఇద్దరి జోడి అదిరింది అని అంటుంది.
 

56

ఇక యష్ (Yash) చాక్లెట్ అంటే మా వసంత్ కి చాలా ఇష్టం అని చెప్పగా నిధి తనకు స్వయంగా చాక్లెట్ తినిపిస్తుంది. దాంతో యష్ వేద వాళ్ళ ముందు ఫన్నీ గా రాక్షసానందం పడుతాడు. ఆ తర్వాత ఖుషి (Khushi) తన అమ్మకు చాక్లెట్ తినిపిస్తుంది. ఇక యష్ ఖుషి కి ప్రేమతో ఒక ముద్దు పెడతాడు.
 

66

ఇక తరువాయి భాగం లో వంటలు చేసే కార్యక్రమం లో యష్ (Yash) కూరగాయలు మొత్తం వేద తో కట్ చేపిస్తాడు. అంతేకాకుండా నీలాంటి అమ్మాయి పొగరు దించితే ఆ కిక్కే వేరు అని అంటాడు. ఇక వేద (Vedha) పెద్దగా ఏడ్చుకుంటూ ఆ పని యష్ కు అప్పచెబుతుంది.

click me!

Recommended Stories