YouTuber Madhumita: యూట్యూబర్ మధుమిత ఈ మధ్య బాగా ట్రెండయిన పేరు. ఇన్ స్టా, యూట్యూబ్ ఖాతాలలో తమ డబ్బును, బంగారాన్ని చూపించి ఫేమస్ అయింది. ఆ బంగారం మరుసటి రోజే దొంగతనానికి గురైంది. అయితే ఇప్పుడు ఆమెపైనే బంగారం దొంగిలించిన కేసు పడింది.
ప్రముఖ యూట్యూబర్ మధుమిత పేరు గుర్తుపట్టకపోయినా ఆమెను చూస్తే మాత్రం ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. మెడ నిండగా బంగారు ఆభరణాలోత, చేతిలో డబ్బు కట్టలతో ఆమె ఎన్నో రీల్స్ చేసింది. మంచంమంతా డబ్బులు పరిచి ఆమె చేసిన రీల్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆమె పై బంగారు గొలుసు చోరీ కేసు నమోదైంది. 89 ఏళ్ల భవన నిర్మాణ కాంట్రాక్టర్ పెచ్చిముత్తు ఇచ్చిన ఫిర్యాదుతో తమిళనాడు రాజాక్కమంగళం పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో తన మెడలో ఉన్న సుమారు 5 సవర్ల బంగారు గొలుసు కనిపించకుండా పోయిందని ఆయన పోలీసులకు తెలిపారు. ఈ ఘటనలో మధుమితపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది.
23
పాత కేసు ఇప్పుడు పెట్టారు
పెచ్చిముత్తుకు మధుమితతో గతంలో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో తిరునెల్వేలి కోర్టు సమీపంలో మధుమిత తన వాహనం ఎక్కిందని ఆయన చెప్పారు. అనంతరం ఆమెను బస్‌స్టాండ్ వద్ద దింపి ఇంటికి వెళ్లారు. ఇంటికి చేరుకున్న తర్వాత మెడలో ఉన్న బంగారు గొలుసు కనిపించలేదని గుర్తించారు. ఈ విషయం గురించి మధుమితను ఫోన్‌లో అడిగితే తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు తీస్తానని బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
33
మధుమిత ఇంట్లోనే భారీ చోరీ
ఇదిలా ఉంటే మధుమిత ఇంట్లో జరిగిన మరో భారీ చోరీ కేసు కూడా ఇటీవల సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 24న ఆమె కుటుంబంతో బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి దుండగులు ప్రవేశించి 118 సవర్ల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు 89 ఏళ్ల కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదుతో మధుమితపై మరో కేసు నమోదైంది. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.