KGF2 Review: `కేజీఎఫ్‌ 2` మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. రాఖీభాయ్‌ సునామీకి రికార్డులు షేక్‌

First Published | Apr 14, 2022, 2:45 AM IST

`బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఆ స్థాయి భారీ అంచనాలతో వస్తోన్న సినిమా `కేజీఎఫ్‌2`. మొదటి భాగానికిది కొనసాగింది. యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన `కేజీఎఫ్‌2` సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రదర్శించబడుతోంది. ఆడియెన్స్ ట్విట్టర్‌ రివ్యూలను చూద్దాం. 

ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడ నుంచి వచ్చిన ఓ సినిమా ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసింది. అదే `కేజీఎఫ్‌`(2018)(KGF). కన్నడ చిత్ర పరిశ్రమ సత్తాని చాటిన చిత్రమిది. దాదాపు 250కోట్లు వసూలు చేసింది. కన్నడలో అత్యధిక కలెక్షన్లు కలెక్ట్ చేసిన చిత్రమిది. ఆ టైమ్‌లో నాన్‌ `బాహుబలి` రికార్డులు తిరగరాసింది. కోలార్‌ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో ఓ సాధారణ వ్యక్తి అసాధారణంగా ఎదిగే కథాంశంతో రూపొందిన `కేజీఎఫ్‌` సినిమా సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచింది. 

మొదటి భాగం రికార్డులు తిరగరాయడంతో రెండ్‌పార్ట్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. `కేజీఎఫ్‌ 2` (KGF2) ఎలా ఉండబోతుందనే ఇంట్రెస్ట్ గా మారింది. దేశమే కాదు, ప్రపంచం సైతం ఈ చిత్రం కోసం ఎదురుచూస్తోంది. యష్‌ హీరోగానే సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, ప్రకాష్‌ రాజ్‌, శ్రీనిధిశెట్టి, రావు రమేష్‌ ప్రధాన పాత్ర ధారులుగా ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2` గురువారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదివేల థియేటర్లలో విడుదలవుతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డులు క్రియేట్‌ చేసింది. అరవై కోట్లకు మించి జస్ట్ అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారానే పొందినట్టు టాక్‌. ఈ నేపథ్యంలో ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రదర్శించబడింది. మరి అక్కడి ఆడియెన్స్ సినిమాపై ట్విట్టర్‌లో ఇచ్చిన రివ్యూని తెలుసుకుందాం.
 


`కేజీఎఫ్‌` మొదటి భాగంలో పాత్రల పరిచయం, రాఖీ(యష్‌) కాస్త రాఖీ భాయ్‌గా ఎదిగిన తీరుని చూపించారు. రెండో పార్ట్ లో రాఖీభాయ్‌ కేజీఎఫ్‌ని తన ఆధీనంలోకి తీసుకుని ఇండియాని శాషించడం చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయనతో మరో బలమైన విలన్‌ అధీర(సంజయ్‌ దత్‌), దేశ ప్రధాని(రవీనా టండన్‌) చేసే పోరాటం ప్రధానంగా `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2` సాగుతుందని రివ్యూల ద్వారా తెలుస్తుంది. 

సినిమాలో హీరో యష్‌ మరోసారి ఇంట్రడక్షన్‌ అదిరిపోయేలా ఉందట. జస్ట్ మైండ్‌ బ్లోయింగ్‌ అంటున్నారు. ఆయన పాత్ర ఎలివేషన్‌, బీజీఎం నెక్ట్స్ లెవల్‌ అంటున్నారు ట్విట్టర్‌ ఆడియెన్స్. ఫస్టాఫ్‌ చాలా బాగుందట. ఆద్యంతం రేసీగా సినిమా సాగుతుందని కామెంట్‌ చేస్తు్నారు. మదర్‌ సెంటిమెంట్లు సీన్లు చాలా ఎఫెక్టీవ్‌గా ఉన్నాయట. ఇంటర్వెల్‌ సీన్‌ చాలా రా గా ఉంటుందట. బట్‌ మంత్రముగ్దుల్ని చేసేలా ఉంటుందంటున్నారు. `తుఫాన్‌` పాట సినిమాకి హైలైట్‌గా ఉంటుందట.

రాఖీ పాత్రనే కాదు విలన్‌ అయిన అధీర(సంజయ్‌ దత్‌) పాత్ర ఎంట్రీ సైతం అబ్బురపరిచేలా ఉందని, బెస్ట్ ఇంట్రడక్షన్‌ అంటున్నారు. సినిమాకి కథ, యష్‌ నటన, బీజీఎం, మదర్‌ సెంటిమెంట్‌ హైలైట్‌గా నిలుస్తాయని, క్లైమాక్స్ వాహ్‌ అనిపించేలా ఉందట.  కానీ పూర్తి యాక్షన్‌ ప్యాక్డ్ చిత్రమంటున్నారు.

మొదటి భాగంలో అనంత  నాగ్‌ కథ చెబుతుంటాడు. ఈ సెకండ్‌ పార్ట్ లో ఆయన కుమారుడైన ప్రకాష్‌ రాజ్‌ స్టోరీ నెరేట్‌ చేస్తుంటాడు. కానీ యష్‌, సంజయ్‌దత్‌ ఇద్దరే సినిమాని నడిపిస్తారని, వారిద్దరి చుట్టూతే ప్రధానంగా సాగుతుందని, ఇద్దరూ ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంటారని పోస్ట్ పెడుతున్నారు. ఫస్టాఫ్‌ ఫుల్‌ యాక్షన్‌తో సాగుతుందని, ద్వితీయార్థం ఎమోషనల్‌గా, మదర్‌ సెంటిమెంట్‌తో ఇంటెన్స్ గా సాగుతుందట. క్లైమాక్స్ ఊహించని విధంగా, గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటుందని టాక్‌.

అయితే మరికొందరు.. సినిమా యావరేజ్‌గానే ఉంటుందని, అహో, ఓహో అనేలా లేదని, ఫర్వాలేదనిపించేలా ఉందిగానీ, మరీ గొప్పగేం లేదని చెబుతున్నారు. సినిమా మొత్తం ఒకే లుక్‌ కనిపించడం, లొకేషన్‌ కూడా సేమ్‌ ఉండటం బోరింగ్‌గా అనిపిస్తుందట. అయితే సినిమా ఎంగేజింగ్‌గా సాగుతున్న నేపథ్యంలో అవన్నీ మర్చిపోతారని అంటున్నారు. మొత్తంగాసినిమాకి ట్విట్టర్‌ ఆడియెన్స్ 4 స్టార్స్ రేటింగ్‌ ఇస్తున్నారు. ఇదే నిజమైతే సినిమా బాక్సాఫీస్‌ షేక్‌ చేయడంతోపాటు ఇండియన్‌ సినిమా రికార్డ్ లను తిరగరాయడంలో సందేహం లేదనేది నెటిజన్ల టాక్‌. 

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయిపోయారని, రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌ సూపర్‌ హీరో దర్శకులు. ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్ కి రూపకర్తలు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొత్తంగా సోషల్‌ మీడియా ఆడియెన్స్‌ సినిమాపై తమ రివ్యూని అందించారు. మరి నిజంగానే సినిమా ఇలా ఉందా? మొదటి భాగం తర్వాత ఏర్పడిన అంచనాలను రీచ్‌ అయ్యింది. కలెక్షన్ల రికార్డ్ లు తిరగరాస్తుందా? అనేది `ఏషియా నెట్‌` పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.

Latest Videos

click me!