మార్కెట్‌లో బెండకాయకి బదులు అమ్మాయిని గిల్లిన సుడిగాలి సుధీర్‌.. అందరు కలిసి చితక్కొట్టారంటూ రోజా ముందు ఆవేదన

Published : Apr 13, 2022, 09:45 PM ISTUpdated : Apr 14, 2022, 07:34 AM IST

సుడిగాలి సుధీర్‌కి దారుణమైన అవమానం జరిగింది. మార్కెట్‌లో ఆయన్ని పట్టుకుని అందరు కలిసి చితక్కొట్టారట. ఈ విషయాన్ని అందరి ముందు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడీ జబర్దస్త్ కమేడియన్‌. 

PREV
18
మార్కెట్‌లో బెండకాయకి బదులు అమ్మాయిని గిల్లిన సుడిగాలి సుధీర్‌.. అందరు కలిసి చితక్కొట్టారంటూ రోజా ముందు ఆవేదన

సుడిగాలి సుధీర్‌ అంటే ఎప్పుడూ అమ్మాయిలను పడేసేవాడని, అమ్మాయిల చుట్టూ తిరిగేవాడనే ముద్ర వేశారు. `జబర్దస్త్`లో ఆయనపై నిత్యం అలాంటి స్టోరీలే రాస్తుంటారు. నవ్వులు పూయిస్తుంటారు. అయితే తాజాగా సుధీర్‌ తనకు జరిగిన అవమానం,  ఎదురైన ఘోరమైన ఘటనని వెల్లడించారు. `ఎక్స్ ట్రా జబర్దస్త్` వేదికగా అందరి ముందు తన బాధని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

28

`ఎక్స్ ట్రా జబర్దస్త్`లో జనరల్‌గా సుడిగాలి సుధీర్‌ రాంప్రసాద్‌, గెటప్‌ శ్రీను, హైపర్‌ ఆదిలతో కలిసి వస్తుంటాడు. కానీ ఈసారి మాత్రం కెవ్వు కార్తీక్‌తో కలిసి వచ్చాడు. కార్తీక్‌, సుధీర్‌.. కలిసి `నాకొక గర్ల్ ఫ్రెండ్‌ కావాలి` అంటూ పాట పాడుకుంటూ వచ్చారు. సుధీర్‌కి ఇంకా పదహారే అంటే రోజా కౌంటర్‌ ఇచ్చింది. ఇంకా 20ఏళ్లు కిందకి తోసేశాడని పంచ్‌ వేసింది. అప్పుడే కార్తీక్‌ రెచ్చిపోయాడు. సుధీర్‌ గురించి ఒక విషయం బయటపెట్టాడు. ఇలాంటి మాటలు చెబుతేనే మొన్న మార్కెట్‌లో చితక్కొట్టారని అసలు బండారం బయటపెట్టాడు. 

38

దీనికి అమాయకంగా రియాక్ట్ అయిన సుధీర్‌, ఇలాంటి మాటలు చెబితే కొట్టలేదు, మా అమ్మ చెప్పినట్టు చేస్తే కొట్టారని అసలు విషయం చెప్పారు. మార్కెట్‌లో బెండకాయలు కొనేటప్పుడు అవి లేతగా ఉన్నాయో లేదో తెలియాలంటే చివర్లు గిల్లి చూడాలని చెప్పిందని, తాను బెండకాయలు పట్టుకుని అమ్మాయిలను గిల్లానని, దీంతో అందరు కలిసి ఒళ్లు వాచిపోయేలా కొట్టారని తెలిపాడు సుధీర్‌. దీంతో అంతా షాక్‌ అయ్యారు. రష్మి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 

48

ఆ తర్వాత సుధీర్‌ తాత, తనకు రాసిన లెటర్‌ని చదివాడు కార్తీక్‌. తమ పూర్వీకులు తనకు పదివేల కోట్లు ఇస్తూ అమ్మాయిల పిచ్చి వల్ల రెండు వేల కోట్లు చేశాడట. ఈ రెండు వేల కోట్లు నీకు ఇవ్వాలంటే నీకు అమ్మాయిల పిచ్చి లేదని తెలియాలని, దానికోసం 24గంటలు ఏ అమ్మాయిని చూడకుండా ఉండాలి అనే ఫిట్టింగ్‌ పెట్టారు. ఎలాగైనా ఆ అమౌంట్‌ దక్కించుకోవాలని నిర్ణయించుకుంటాడు సుధీర్‌. అమ్మాయిని చూడకుండా ఉండాలనుకుంటారు. 

58

దీంతో అప్పుడే రంగంలోకి దిగింది జబర్దస్త్ యాంకర్‌ రష్మి. సుధీర్‌ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని ప్లాన్‌ చేసింది. ఆయన్ని రెచ్చగొట్టేలా పోజులిస్తూ స్టేజ్‌పై హోయలు పోయింది. అంతేకాదు పాట పాడుతూ తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేసింది. మొన్న ఓ షోలో సుధీర్‌ పాడిన పాటలు పాడుతూ డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో సుధీర్‌ సైతం తనని తాను కంట్రోల్‌ చేసుకోలేకపోయారు. ఆమెని చూసేస్తానని చెప్పగా, కార్తీక్‌ అతన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. 

68

దీంతో సుధీర్‌ సైతం తనని తాను కంట్రోల్‌ చేసుకోలేకపోయారు. ఆమెని చూసేస్తానని చెప్పగా, కార్తీక్‌ అతన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. సుధీర్‌ని మరింతగా టెంప్ట్ చేసేందుకు పూనుకుంది హాట్‌ యాంకర్‌ రష్మి.

78

ఇంతలో రష్మితోపాటు జబర్దస్త్ జడ్జ్ రోజా సైతం డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన గతంలో చెప్పిన డైలాగ్‌లను చెప్పింది. ఆ డైలాగులు చెప్పరాక తడబాటు పడటంతో డైలాగులను చంపేస్తున్నారని సుధీర్‌ చెప్పడం నవ్వులు పూయించింది. 

88

మొత్తంగా రష్మి ఎంత ప్రయత్నం చేసిన సుధీర్‌ చూడకుండా మ్యానేజ్‌ చేశాడు. మరి నిజంగానే ఉండగలిగాడా? మధ్యలోనే రష్మిని చూశాడా? రెండు వేల కోట్లు దక్కించుకున్నాడా? అనేది తెలియాలంటే శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌ని చూడాలి. లేటెస్ట్ గా విడుదలైన `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమోలోని సుధీర్‌ ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది. `ఎక్స్ ట్రా జబర్దస్త్` షో ప్రతి శుక్రవారం ఈటీవీలో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌ స్కిట్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. రష్మి సోయాలు, సుధీర్‌ చిలిపి చేష్టాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories