నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన చిత్రం, బాలయ్య,జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా అలరించిన సినిమా, సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా డైరెక్ట్ చేసిన ఆ మూవీ ఏదో తెలుసా?
నందమూరి ఫ్యామిలీలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ లో కూడా రెండు వార్గాలను మనం గమనించవచ్చు. ఇక ఎన్టీఆర్, బాలయ్య మధ్య గొడవలంటూ ఎన్నో వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇటు సినిమాల పరంగా, అటు పొలిటికల్ గా కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈ విషయాలను తమకు అనకూలంగా మార్చుకుంటున్నారు ప్రత్యర్ధులు. బాలయ్య పేరతో ఎన్టీర్ ను, ఎన్టీఆర్ పేరుతో బాలయ్యను విమర్శిస్తూ పోస్ట్ లు పెట్టడం చూస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఎప్పుడు బహిరంగంగా విమర్శలు చేసుకున్నది లేదు.
26
తండ్రీ కొడుకులుగా నటించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
అయితే బాలకృష్ణ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించాడని మీకు తెలుసా? అది కూడా బాలయ్య కొడుకుగా తారక్ నటించాడు, మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో పెద్దాయన నందమూరి తారకరామారావు కూడా ఉన్నాడు. ఒక రకంగా నందమూరి వంశంలో మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఏకైక సినిమా ఇదే. ఇంతకీ ఆ ఆ అద్భుత కళాఖండం ఏదో కాదు 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' మూవీ. అయితే ఈసినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర గురించి ఓ పెద్ద కథే ఉంది.
36
ప్రయోగాత్మక చిత్రం
తెలుగు సినిమా చరిత్రలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఈ కుటుంబం నుంచి మూడో తరం హీరోలు వెండితెరపై సందడి చేస్తున్నారు. లెజెండరీ ఎన్టీఆర్, ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు స్టార్స్ కలిసి బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా తెలుగు వర్షన్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మిస్ అయ్యాడు. తారక్ ను హిందీ వెర్షన్ సినిమాలో నటింపచేశారు పెద్ద ఎన్టీఆర్. ఈ సినిమాకు స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం కావడంతో. రాజకీయాల్లో ఈసినిమా పెద్ద ప్రకంపనలే సృష్టించింది.
అంతే కాదు ఈ సినిమా తెలుగులో విడుదలై విమర్శల పాలై, ఆర్థిక పరంగా నష్టాలు తీసుకువచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే, దీని హిందీ వెర్షన్ కూడా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్వయంగా విశ్వామిత్రుడు పాత్రలో నటించగా, బాలకృష్ణ హరిశ్చంద్రుడు, దుష్యంతుడు పాత్రల్లో కనిపించాడు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలో ఈ చిత్రంలో భరతుడు పాత్రలో కనిపించాడు. అంటే దుష్యంతుడు, శకుంతల కుమారుడి పాత్రలో నటించాడు. బాలయ్య తండ్రి పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొడుకు పాత్రలో కనిపించారు.
56
ఆశ్చర్యపోయిన సీనియర్ ఎన్టీఆర్
ఫిల్మ్ ఇండస్ట్రీలో తారక్ మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ హిందీ నైపుణ్యం ఉన్న తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతికారట. అప్పట్లో ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రం షూటింగ్ సమయంలో తారక్ హిందీ మాట్లాడిన తీరుతో ముగ్ధుడైన ఎన్టీఆర్, వెంటనే ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకున్నారట. కానీ ఈసినిమా రిలీజ్ అవ్వలేదు. కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ ఆ సినిమా తెరపైకి రాలేదు.
66
రిలీజ్ ఆగిపోయిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర
‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్ కోసం బాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయడం, లతా మంగేష్కర్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు వంటి గాయకులు పాటలు పాడటం కూడా ఈ సినిమా పై అంచనాలు పెంచేసింది. కానీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ తెలుగు వెర్షన్ ఫెయిల్యూర్ అవ్వడంతో హిందీలో రిలీజ్ చేయడానికి ధైర్యం చేయలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో హిందీ వెర్షన్ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరికి అది కూడా బయటికి రాలేదు. దీంతో నందమూరి అభిమానులకు ఈ సినిమా విడుదల కాకపోవడం ఒక తీరని లోటుగా మిగిలిపోయింది.