KGF Chapter 3 లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ సైలెంట్ గా పెద్ద ప్లానే వేశాడుగా..?

First Published | Sep 20, 2024, 5:49 PM IST

కెజియఫ్ చాఫ్టర్ 3 లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వింటానికి షాకింగ్ గా ఉంది కదా..? మరి సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోండి. 

సలార్ సినిమాతో ప్రభాస్ ను ఫెయిల్యూర్స్ నుంచి బయట పడేశాడు ప్రశాంత్ నీల్. ఇక సలార్ 2 తో అంతకు మించిన విజయం అందిస్తాను అని పట్టుదలతో ఉన్నాడు. ప్రభాస్ కోసం ఇంకాస్త డిఫరెంట్ గా.. క్యూరియాసిటీతో సలార్ 2ను ప్లాన్ చేస్తున్నాడట. కన్నడ దర్శకుడు. 

Also Read: ఇండస్ట్రీకి దూరంగా సంపూర్ణేష్ బాబు
 

Prabhas, Hanu , Iman Esmail

ఇక ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా ఇచ్చిన జోష్ తో.. తన నెక్ట్స సినిమాలను లైన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే మారుతి డైరెక్షనర్ లో రాజా సాబ్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. త్వరలో హను రాఘవపూడి సినిమా కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అసలు ఈసినిమా ఇప్పటికే  సీక్రెట్ గా స్టార్ట్ అయ్యింది అని అంటున్నారు. మరి నిజమెంతో తెలియదు. 

Also Read: దర్జాగా బతికిన భానుమతి.. చివరి రోజుల్లో.....


ఈక్రమంలో ఈ ఏడాదిలోనే సలార్ 2 కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ నీల్. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇటు సలార్ 2 అటు తారక్ సినిమా.. రెండింటిలో ఏ సినిమా ముందు అనేది మాత్రం క్లారిటీ లేదు. 

అయితే సలార్ 2 ఇప్పుడు చేస్తేనే.. సలార్ 1 కు కంటీన్యూషన్ గా బాగుంటుంది. లేదు ఎన్టీఆర్ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ సలార్2  చేస్తేమటుకు.. సినిమాపై క్యూరియాసిటీతో పాటు.. అంచనాలు కూడా తప్పే ప్రమాదం ఉంది. దాంతో ప్రశాంత్ నీల్ ఏం నిర్ణయం తీసుకుంటాడా అని అంతా ఎదరు చూస్తున్నారు. 

Also Read:  ప్రభాస్ ఫౌజీ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

ఈక్రమంలోనే ప్రభాస్ ‌- ప్రశాంత్ నీల్ కు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రశాంత్ నీల్ కెజియఫ్ రెండు సినిమాలు చేశారు.. ఇక త్వరలో కేజియఫ్ ఛాప్టర్ 3 కూడా తెరెక్కిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఉంది.. కాని అది ఇప్పట్లో సాధ్యం అవ్వదనే చెప్పాలి. 

Also Read:  మోక్షజ్ఞ కోసం మహేష్ బాబు హీరోయిన్

కాస్త లేట్ అయినా.. కెజియఫ్ 3ని చాలా అద్భుతంగా.. అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. అందులో భాగంగా ఈసారి ఈసినిమాకు ఎక్ట్స్ ట్రా పవర్ తో  పాటు గ్లామర్ ను ఆడ్ చేయడం కోసం ప్రభాస్ ను రంగంలోకి దింపబోతున్నాడని కన్నడ మీడియా నుంచి టాక్ గట్టిగా నడుతుస్తోంది. 
 

Also Read: నాగార్జునకు నైట్ నిద్ర పట్టాలంటే.. అది తినాల్సిందే,

అటు యష్.. ఇటు ప్రభాస్.. ఇద్దరి కాంబోలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని హద్దుకున్నట్టే ఉంటుంది. మరి ఈ విషయంలో నిజం ఎంత..?  ప్రశాంత్ నీల్ కెజియఫ్ ఛాప్టర్ 3 ని నిజంగాస్టార్ట్ చేస్తారా..? ప్రస్తుతం సలార్ 2 విషయంలో ఆయన నిర్ణయం ఏంటి..? ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు  స్టార్ట్ చేస్తాడు అనేది చూడాలి. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Videos

click me!