జానీ మాస్టర్, లేడీ కొరియోగ్రాఫర్ వివాదం ఇప్పుడు టాలీవుడ్ ని కుదిపేస్తోంది. లేడీ కొరియోగ్రాఫర్ తనని జానీ మాస్టర్ లైంగిక వేధింపులకి గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనితో పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. కోర్టులో కూడా హాజరు పరిచారు. అయితే కోర్టు జానీ మాస్టర్ కి రిమాండ్ విధించింది.