రజనీకాంత్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘వేట్టయాన్’, ‘కూలీ’ కోసం వర్క్ చేస్తున్నారు. టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ‘వేట్టయాన్’లో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు.
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్ 10న ఇది విడుదల కానుంది. ‘కూలీ’ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, శ్రుతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.