ఈ ఎపిసోడ్‌లో నవదీప్, కొత్త కంటెస్టెంట్లకు ఓ డేర్ టాస్క్ ఇచ్చారు. ‘‘ఎవరైనా నా ముఖంపై నీళ్లు చల్లాలి’’ అని అన్నారు. అయితే ఎవరూ ముందుకు రాకపోవడంతో దర్శకుడు క్రిష్ స్పందిస్తూ, ‘‘నేను కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా నీళ్లు చల్లేవాడిని,’’ అన్నారు. ఇప్పటికే పలువురు ప్రేక్షకుల దృష్టిలోకి వచ్చిన నల్గొండ కేతమ్మ, ఈ సందర్భంలో తన జీవితంలో ఎదురైన కష్టాల్ని ఒక పాట రూపంలో వివరించారు. ఆమె గాత్రం, భావప్రకటనలు చూసి చలించిపోయిన క్రిష్, "మీకు ఇష్టం ఉంటే నా తదుపరి సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం తీసుకుంటాను" అని చెప్పారు. ఈ మాట విన్న కేతమ్మ కంట్లో ఆనందబాష్పాలు వెల్లివొచ్చాయి.