తెలుగు బిగ్ బాస్ 9 సీజన్‌కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ 7 నుంచి ఈ సీజన్ గ్రాండ్ లాంచింగ్ జరగనుండగా, ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారనే ఉత్కంఠతో సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతోంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన బిగ్ బాస్ టీమ్, ‘అగ్ని పరీక్ష’ పేరుతో ఓ ప్రత్యేక పోటీ నిర్వహిస్తోంది. ఇందులో విజయం సాధించిన ఐదుగురు కామనర్స్‌కి హౌస్‌లోకి ఎంట్రీ అవకాశం కల్పించనున్నారు.