షూట్ పేరుతో హాస్పటల్ లో హంగామా, కేసు.. ఫహద్ ఫాజిల్ ఇరుక్కోబోతున్నారా?

First Published Jun 29, 2024, 7:33 AM IST

పుష్ప పార్ట్ 1 ఎండింగ్ లో వచ్చిన ఆయన పాత్ర.. పుష్ప 2 ది రూల్ లో మాత్రం చాలా కీలకంగా ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 కోసం 

Pushpa Actor Fahadh Faasil

సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ నటుల్లో ఫహద్ ఫాజిల్ ఒకరనేది కాదనలేని సత్యం. కేరళకు చెందిన  ఫహద్.. ప్రధానంగా మలయాళం మరియు తమిళ చిత్రాల్లో  కనిపిస్తూంటారు. కేవలం  హీరో గానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ని రెడీ చేసుకున్నారు. అలాగే జాతీయ ఉత్తమ నటుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

fahadh fasil

మరో ప్రక్క నిర్మాతగా సైతం సత్తా చాటుతున్న ఫహద్ ఫాజిల్.. పుష్ప ది రైజ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన‌ ఈ చిత్రం 2021లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ ఐపిఎస్ గా ఫ‌హ‌ద్ ఫాజిల్ నటించారు. 

పుష్ప పార్ట్ 1 ఎండింగ్ లో వచ్చిన ఆయన పాత్ర.. పుష్ప 2 ది రూల్ లో మాత్రం చాలా కీలకంగా ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 కోసం ఫ‌హ‌ద్ ఫాజిల్ కంటిన్యూ వర్క్ చేస్తన్నారు. మధ్య గ్యాప్ లో వేరే సినిమాలో నటుడుగానూ,నిర్మాతగానూ చేస్తూ బిజిగా ఉన్నారు. రీసెంట్ గా  ఆయన నటించిన ఆవేశం చిత్రం ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై కేరళ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమీషన్ ఓ కేసు రిజిస్టర్ చేసింది.
 

ఫహద్ ఫాజిల్ నిర్మాతగా ఉన్న ఓ చిత్రం షూటింగ్ విషయమై ఈ కంప్లైంట్ రైజ్ చేసారు. ఈ సినిమాని కేరళ అంగమలై తాలుక హాస్పటిల్ ఎర్నాకులంలో షూట్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు ఇక్కడ కీలకమైన షూట్ చేసే ప్రాసెస్ లో అక్కడ ఆల్రెడీ ఉన్న పేషెంట్స్ ని చాలా ఇబ్బందికి గురి చేసారనేది అభియోగం.
 

Fahaad Faasil

అక్కడ లోకల్ మీడియా రిపోర్ట్ లను బేస్ చేసుకుని కేసు నమోదు చేసారు. ఆ కేసులో ఫిల్మ్ క్రూ ఎమర్జన్సీ రూమ్ అనేది కూడా పట్టించుకోకుండా షూటింగ్ పేరుతో హల్ చల్ చేసారు. లైట్లుతో ఇబ్బంది పెట్టారు. అలాగే ఎమర్జిన్సీ రూమ్ కు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి అక్కడ స్టాఫ్ ని ,పేషెంట్స్ కు అసౌకర్యం కలిగించారు. దాదాపు 50 మంది ఫిల్మ్ స్టాప్,నటులుతో ఎమర్జన్సీ రూమ్ లో చాలా ఇబ్బందికరమైన పరిస్దితులు ఎదురయ్యాయి

ఈ విషయం తెలుసుకున్న కేరళ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమీషన్ మెంబర్ వికే బీనా కుమరి స్పందించారు. ఎర్నాకులం డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ని, అంగమలై తాలూక హాస్పటిల్ సూపర్ డెంట్ ని ఈ విషయమై ఏడు రోజులు లోగా వివరణ ఇవ్వమని కోరింది. 
 

ఈ సినిమా షూటింగ్ కు వేరే సెట్ వేసుకోకుండా నేచురాలిటీ కోసం డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే షూటింగ్ చేయటం మొదలెట్టారు. ఈ సినిమా పేరు  Painkili. దీని నిర్మాత ఫహద్ ఫాజిల్. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఫహద్ ఫాజిల్. అయితే ఊహించని విధంగా ఈ సమస్య రావటం జరిగింది. ఈ క్రమంలో ఫహద్ ఫాజిల్ పైనా కేసు పెట్టారని తెలుస్తోంది.

ఎమర్జన్సీ రూమ్ లో స్పేస్ బాగా తక్కువగా ఉంది. ఓ  పేషెంట్ క్రిటికల్ కండీషన్ లో వస్తే అతన్ని చేర్చుకునే పరిస్దితి కనపడలేదు. ఎవరినీ మెయిన్ గేట్ నుంచి లోపలకి ఎలౌ చేయలేదు. అలాగే షూటింగ్ జరుగుతున్నప్పుడు అటూ ఇటూ ఎవరినీ కదలవద్దని, పేషెంట్స్ ని మాట్లాడవద్దని సైలెంట్ గా ఉండమని ఫిల్మ్ క్రూ చెప్పారు. తమ షూటింగ్ కోసం వాళ్లు అలా చేసినా అది అందరినీ ఇబ్బంది పెట్టే అంశమే. దాంతో ఈ కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఫహద్ ఫాజిల్ స్పందించలేదు. 

ఫహద్ ఫాజిల్ ఒక్క‌ రోజుకు ఏకంగా రూ. 12 లక్షలు ఛార్జ్ చేస్తున్నారట. ఇక్క‌డ మ‌రో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. షూటింగ్ కు వ‌చ్చాక ఒక‌వేళ ఆ రోజు షూట్ క్యాన్సిల్ అయినా లేక వాయిదా ప‌డినా రెమ్యున‌రేష‌న్ మాత్రం ఇవ్వాల్సిందే అట‌. అలాగే రెమ్యున‌రేష‌న్ రూ. 12 ల‌క్ష‌ల‌తో పాటు పెనాల్టీ క్రింద ప్రొడ్యూస‌ర్లు ఫ‌హ‌ద్ కు మ‌రో రూ. 2 ల‌క్ష‌లు చెల్లించాల‌ట‌. ఈ కండీష‌న్ కు ఒప్పుకుంటేనే ఆయ‌న ఏ ప్రాజెక్టైనా సైన్ చేస్తార‌ట‌. ప్ర‌స్తుతం పుష్ప 2 మూవీకి కూడా ఫ‌హద్ ఫాజిల్ ఈ విధంగా పారితోషికం తీసుకుంటున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్ న‌డుస్తోంది.

ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూస్తున్నంతసేపే తనను పట్టించుకోవాలే తప్ప తర్వాత తన గురించి ఆలోచించొద్దన్నాడు. అలాగే సినిమాయే జీవితం కాదని ఉపదేశించాడు. అతడు ఇంకా మాట్లాడుతూ.. 'నేను ఏదీ అనుకున్న సమయానికి మొదలుపెట్టను.. పూర్తి చేయను. నేను చేసే సినిమాలు కూడా ముందుగా ప్లాన్‌ చేసుకున్నవి కాదు. ఎగ్జయిట్‌గా అనిపిస్తే వెంటనే చేసేస్తానంతే! ప్రేక్షకులు సినిమా చూసి ఆనందించేందుకు నా వంతు నేను కృషి చేస్తాను.

వాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్‌టైన్‌ అవ్వాలి.. అంతేకానీ తర్వాత నేనేం చేస్తున్నాను? నా లైఫ్‌ ఎలా ఉంది? అని నాగురించి ఆలోచించకూడదు. థియేటర్‌ లోపల ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించండి.. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక నన్ను సీరియస్‌గా తీసుకోకండి. ఖాళీ సమయాల్లోనో లేదా తినేటప్పుడో నటీనటుల గురించి వారి పర్ఫామెన్స్‌ గురించి జనాలు మాట్లాడుకోవడం నాకస్సలు ఇష్టం ఉండదు.

కావాలంటే సినిమా చూసి ఇంటికి తిరిగెళ్లే సమయంలో దాని గురించి డిస్కషన్‌ చేయండి.. అంతే కానీ ఇంట్లో కూడా దాని గురించే ఎందుకు చర్చ? సినిమాను కూడా ఓ హద్దులో ఉంచాలి. కేవలం మూవీస్‌ చూడటమే కాకుండా జీవితంలో చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని గుర్తుంచుకోండి' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫహద్‌.. పుష్ప 2 సినిమాతో పాటు వేటయ్య, మారీషన్‌ సినిమాలు చేస్తున్నాడు.

Latest Videos

click me!