The Kerala Story 2 మూవీ రిలీజ్‌కు బ్రేక్.. 'ది కేరళ స్టోరీ 2'పై హైకోర్టు స్టే.. ఏం జరిగిందంటే?

Published : Feb 26, 2026, 05:21 PM IST

The Kerala Story 2: 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' సినిమా విడుదలను కేరళ హైకోర్టు నిలిపివేసింది. కేరళని  తప్పుగా చూపిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం, తదుపరి విచారణ ముగిసే వరకు సినిమాను రిలీజ్ చేయవద్దని ఆదేశించింది.

PREV
18
'ది కేరళ స్టోరీ 2' రిలీజ్‌కు హైకోర్టు బ్రేక్

'ది కేరళ స్టోరీ 2' సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కేరళ హైకోర్టు ప్రస్తుతానికి విడుదలను ఆపింది. ఈ సినిమా కేరళ ప్రతి ష్టను దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ సందర్భంగా, కోర్టు కోసం ఒక ప్రీ-స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని నిర్మాతలను న్యాయస్థానం కోరింది. అయితే, నిర్మాతలు దీనికి  నిరాకరించారు.

28
ది కేరళ స్టోరీ: గోస్ బియాండ్
ఈ సినిమా పూర్తి పేరు 'ది కేరళ స్టోరీ: గోస్ బియాండ్'. ఈ ట్యాగ్‌లైన్ కథ కేరళకు మాత్రమే పరిమితం కాదని సూచిస్తుందని, అందుకే టైటిల్ మార్చేది లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 27 రిలీజ్‌కు ముందే కొచ్చిలో సినిమాను ప్రదర్శించాలని కోర్టు కోరగా, నిర్మాతలు నిరాకరించడంతో విచారణ వాయిదా పడింది.
38
టైటిల్‌ను సమర్థించుకున్న నిర్మాతలు

జస్టిస్ బెచు కురియన్ థామస్ విచారణను మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారంభించారు. ఈ విచారణలో నిర్మాతలు తమ వాదనలు వినిపిస్తూ, సినిమా టైటిల్‌ను సమర్థించుకున్నారు. ఈ క్రమంలో, విచారణ పూర్తయ్యే వరకు సినిమాను విడుదల చేయవద్దని హైకోర్టు మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

48
మూడు రాష్ట్రాలు.. ముగ్గురు మహిళల కథ

ఈ సినిమా టీజర్‌లో మూడు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మహిళలను చూపించారు. ఇది కేవలం కేరళకు సంబంధించిన కథ కాదని, దేశవ్యాప్త కథాంశం అని సూచిస్తుంది. 'గోస్ బియాండ్' అనే ట్యాగ్‌లైన్ కూడా కథ కేరళ దాటి విస్తరించిందని చెబుతోంది. 'ది' అనే పదం దీన్ని మొదటి భాగానికి సీక్వెల్‌గా చూపిస్తుందన్నారు. 

58
టీజర్ రిలీజైన 16 రోజుల తర్వాత పిటిషన్
కేవలం 2 నిమిషాల టీజర్‌ను చూసి సినిమాను అంచనా వేయడం సరికాదని నిర్మాతలు వాదించారు. ఈ చిత్రానికి ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనుమతి ఉందని, అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. టీజర్ రిలీజైన 16 రోజుల తర్వాత పిటిషన్ వేయడం ఆలస్యమని, పిటిషనర్లు కేరళ ప్రజలందరి తరఫున మాట్లాడలేరని వాదించారు.
68
కోర్టులో వాడివేడి వాదనలు
నిర్మాతల తరఫున సీనియర్ లాయర్ ఎస్. శ్రీకుమార్ వాదిస్తూ, ఈ పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యమా లేక ప్రైవేట్ పిటిషనా అని కోర్టు ముందుగా తేల్చాలన్నారు. దీనిపై స్పందించిన జడ్జి, "మేం సినిమా చూడకూడదని మీరు కోరుకుంటున్నారు. ఇది వ్యక్తిగత విషయమా లేక ప్రజా సంబంధిత విషయమా అని కోర్టు మాత్రమే నిర్ణయించాలని మీరు భావిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
78
విచారణ ముగిసే వరకు రిలీజ్ వద్దు: హైకోర్టు
శాంతికి మారుపేరైన కేరళను ఎందుకు తప్పుగా చూపిస్తున్నారని కోర్టు నిర్మాతలను ప్రశ్నించింది. ఈ సినిమా నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో తీశామని చెబుతున్నా, టైటిల్‌లో కేరళ పేరు ఉన్నప్పటికీ, కథకు రాష్ట్రంతో నిజమైన సంబంధం లేదని బెంచ్ అభిప్రాయపడింది. విచారణ పూర్తయ్యే వరకు సినిమాను రిలీజ్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
88
అసలు వివాదం ఏంటి?
ఈ సినిమా విడుదలను నిషేధించాలని, CBFC సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లను కేరళ హైకోర్టు విచారిస్తోంది. మత మార్పిడి, లవ్ జిహాద్, టెర్రరిజం వంటి సున్నితమైన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కథలో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు ఉన్నప్పటికీ, టైటిల్‌లో 'కేరళ' అని పెట్టడం వల్లే రాష్ట్రాన్ని కించపరిచేలా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories