స్టార్ హీరోయిన్ గా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్న కీర్తి సురేష్ సిస్టర్ రోల్స్ కి వెనకాడటం లేదు. సాధారణంగా హీరోయిన్స్ చెల్లెలు పాత్రలు చేస్తే కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది.