ఇక మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ సాధించిన కీర్తి సురేష్.. రీసెంట్ గా తన స్నేహితుడు ఆంటోనీ ని పెళ్లాడింది. సౌత్ ఫిల్మ్స్ ను తగ్గించి.. బాలీవుడ్ పై కన్నేసింది కీర్తి సురేష్. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కీర్తి.. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ హీరోయన్ కు ఈ సినిమాతో నిరాశే ఎదురయ్యింది.