కీర్తిసురేష్‌ ముందు ఐటెమ్‌ భామ కూడా దిగదుడుపే.. ఊరమాస్‌ స్టెప్పులతో రచ్చ.. దుమ్మురేపుతున్న `మహేషా` సాంగ్‌..

Published : May 07, 2022, 09:00 PM IST

కీర్తిసురేష్‌ ట్రెడిషనల్‌కి కేరాఫ్‌, క్యూట్‌నెస్‌కి ప్రతిరూపం అనుకున్నాం. కానీ దాన్ని బ్రేక్‌ చేసింది. మహేష్‌తో కలిసి ఓ మాస్‌ సాంగ్‌లో ఊరమాస్‌ స్టెప్పులేసింది. అభిమానులను షాక్‌కి గురి చేస్తుంది. ఇప్పుడు దుమ్ము దుమారం రేపుతుంది. 

PREV
17
కీర్తిసురేష్‌ ముందు ఐటెమ్‌ భామ కూడా దిగదుడుపే.. ఊరమాస్‌ స్టెప్పులతో రచ్చ.. దుమ్మురేపుతున్న `మహేషా` సాంగ్‌..

కీర్తిసురేష్‌.. కూడా తన హద్దులు చెరిపేస్తుంది. ఇప్పటి వరకు సంప్రదాయానికి పెద్ద పీట వేసిన ఆమె తాజాగా మాస్‌ స్టెప్పులతో రెచ్చిపోయింది. ఐటెమ్‌ సాంగ్‌ హీరోయిన్లు కూడా ఈ రేంజ్‌లో మాస్‌ స్టెప్పులేయరేమో అనిపించేలా రెచ్చిపోయింది కీర్తిసురేష్‌. ఫస్ట్ టైమ్‌ ఆమె పొట్టి దుస్తులు ధరించి మహేష్‌తో మాస్‌ బీట్‌కి స్టెప్పులేసింది. ఇదంతా తాజాగా విడుదలైన `సర్కారు వారి పాట`లోని `మ మ మహేషా` పాటలో. ఈ పాటని `అరబిక్‌ కుత్తు` ఫేమ్‌ జోనితా గాంధీ, శ్రీ కృష్ణ ఆలపించారు. థమన్‌ సంగీతం అందించారు.

27

ఈ పాట లిరికల్‌ వీడియోని శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో మహేష్‌, కీర్తిసురేష్‌ చేసే డాన్సులు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. థియేటర్‌లో ఫ్యాన్స్ తోపాటు మాస్‌ ఆడియెన్స్ సైతం ఊగిపోవడం ఖాయమని చెప్పొచ్చు. అంతగా దుమ్ములేపారు. ప్రస్తుతం ఈ పాట అటు యూట్యూబ్‌తోపాటు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతుంది. ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో మొత్తం కీర్తిసురేష్‌ మాస్‌ లుక్‌ గురించే చర్చ జరుగుతుండటం విశేషం. 

37

మహేష్‌బాబు సైతం చాలా రోజుల తర్వాత `సర్కారు వారి పాట` చాలా ఫ్రీగా కనిపిస్తున్నారు. గతంలో సెటిల్డ్ గా ఉండేవారు. కానీ ఇందులో బాడీ మూవ్‌మెంట్‌ ఫ్రీగా ఉంది. సినిమాలో ఆయన పాత్ర కూడా అలానే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు `మ మ హేషా` సాంగ్‌లోనూ అదే తరహాలో డాన్సు స్టెప్పులేయడం విశేషం. ఆయన కూడా డాన్స్ స్టెప్పులతో ఇరగదీశారు. ఫ్యాన్స్ కి ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చారని చెప్పొచ్చు. 

47

ఇటీవల `పుష్ప` చిత్రంతో రష్మిక మందన్నా ఇలాంటి ఊరమాస్‌ లుక్ లో కనిపించింది. డాన్సులు కూడా అదే స్థాయిలో చేసి ఆకట్టుకుంది. శ్రీవల్లిగా ఆడియెన్స్ లో నిలిచిపోయింది. ఇప్పుడు `సర్కారు వారి పాట`లో కీర్తిసురేష్‌ కూడా కళావతిగా నిలిచిపోతుందని చెప్పొచ్చు. 

57

ఇందులో ఇప్పటికే విడుదలైన `కళావతి` సాంగ్‌ దుమ్మరేపింది. ఇప్పుడు మహేష్‌, కీర్తిసురేష్‌లపై వచ్చే `మ మ మహేషా` సాంగ్‌ కూడా దద్దరిల్లేలా ఉంది. థియేటర్లలో ఆడియోన్స్ ని స్టెప్పులేయిస్తుందని తెలుస్తుంది. ఇది చూశాక ఐటెమ్‌ భామలు అవసరం లేదు. కీర్తిసురేష్‌ వారిని మించి పోతుందనే ఆలోచన వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు నెటిజన్లు. 

67

ఇందులో కీర్తిసురేష్‌ కనిపించిన తీరు చూస్తుంటే తన బౌండరీలో నుంచి ఆమె బయటపడినట్టే కనిపిస్తుంది. గ్లామర్‌ సైడ్‌ తాను మరింత ఓపెన్‌ అవుతున్నట్టే అనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ ఇంతటి హాట్‌ లుక్‌లో కనిపించలేదు కీర్తిసురేష్‌. కానీ ఫస్ట్ టైమ్‌ ఇందులో ప్రయత్నించింది. దర్శకుడు ఆమెని క్యూట్‌ యాంగిల్‌ నుంచి హాట్‌ యాంగిల్‌లో చూపించినట్టు అనిపిస్తుంది. జస్ట్ లిరికల్‌ సాంగ్‌లోనే ఈ రేంజ్‌లో ఉంటే, పూర్తి పాట, ఇక సినిమాలో ఏ రేంజ్‌లో మెస్మరైజ్‌ చేస్తుందో చూడాలి. 
 

77

మహేష్‌, కీర్తిసురేష్‌ జంటగా నటించిన  `సర్కారు వారి పాట` ఈ నెల 12న విడుదల కాబోతుంది. ప్రమోషన్‌ కార్యక్రమాలతో జోరు పెంచారు. దర్శకుడు పరశురామ్‌, కీర్తిసురేష్‌ వరుసగా ఇంటర్వ్యూలిస్తున్నారు. ఇప్పుడు శనివారం సాయంత్రం హైదరాబాద్‌ని  యూసఫ్‌ గూడలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories